Janasena Party: జనసేన ప్రెస్ రిలీజ్ వేడుకలకు దూరంగా
అమరావతి:
- జనసేన ప్రెస్ రిలీజ్ వేడుకలకు దూరంగా
- కరోనా బాధితులకు అండగా
- జనసేన పార్టీ ఆక్సిజన్ సిలిండర్, నార్మల్ వెంటిలేటర్ల పంపిణీ
- పవన్ కల్యాణ్ గారి జన్మదిన వారోత్సవాలు సందర్భంగా డొనేషన్
- రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ ఆసుపత్రులకు 335 యూనిట్ల అందచేత
Somireddy Chandramohan Reddyసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు:
-- జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
-- జిల్లాలో సాగు చేసిన అన్ని వెరైటీల వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు చేయాలి.
-- దాన్యం కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు సేకరించాలి,
-- ఎన్ఎల్ఆర్ 3354 రకం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనలేని పక్షంలో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేలు పరిహారం చెల్లించాలి.
Amaravati: గుడివాడ అమరానాథ్...వైసీపీ ఎమ్మెల్యే
అమరావతి.
- గుడివాడ అమరానాథ్...వైసీపీ ఎమ్మెల్యే
- త్వరగా కేసు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెపితే ఇష్టానుసారంగా మాట్లాడ్తున్నారు
- మూడు రాజధానులు పక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఎదో ఒక రూపంలో అడ్డుకోవాలని టీడీపీ చూస్తుంది....
- ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు..
- 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారు..
- రాజధానిలో మా కులం తప్ప వేరే వారు ఉండరాదనే ఉద్దేశ్యంతో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు...
- వైజాగ్ లో పరిపాలన రాజధాని, కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటి..
- మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వైజాగ్ పై విషం చిమ్ముతున్నారు..
- జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం ఆలోచన చేస్తే చంద్రబాబు అమరావతిలో రేట్లు కోసం పాటు పడుతున్నారు..
- ఆధారాలు లేని ఆరోపణలు చంద్రబాబు చేస్తున్నారు..
- 14 నెలల కాలంలో 60 వేల కోట్ల సంక్షేమం కోసం ఖర్చు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి మినహా దేశంలో మరొకరు లేరు..
- కమ్యూనిస్టు పార్టీలు తమ భావజాలాన్ని చంద్రబాబు కోసం మార్చుకుంటున్నాయి...
- మూడు రాజధానులు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపక ముందే స్టేట్ గెస్ట్ హౌస్ కోసం ప్రభుత్వం జోవో విడుదల చేసింది..
- బౌద్ద క్షేత్రాన్ని నాశనం చేస్తున్నారని తప్పుడు వార్తలు రాస్తున్నారు..
- బౌద్ద క్షేత్రం కేవలం ఆరు ఎకరాల్లో మాత్రమే విస్తరించి ఉంది..
- స్టేట్ గెస్ట్ హౌస్ కు, బౌద్ద స్థూపాల బఫర్ జోన్ కు మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది.
- ప్రపంచంలో ఎక్కడ ప్రమాదం జరిగిన విశాఖపట్నంకు ముడి పెడుతున్నారు..
- వైజాగ్ కు రైల్వే జోన్ రాకుండా అడ్డుకునేకునే ప్రయత్నం చేశారు..
- అమరావతిలో కెమెరా ఉద్యమం నడుస్తోంది..
- కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించమంటే చంద్రబాబు రాష్ట్రానికి రాష్ట్రానికి దూరం పాటిస్తున్నారు..
- కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ను చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చుకోవాలి..
- సీపీఐ రామకృష్ణ దానికి అధ్యక్షుడుగా వ్యవహరించాలి..
Amaravati: ట్విట్టర్ లో టిడిపి నేత,మాజీ మంత్రి జవహర్...
అమరావతి
- ట్విట్టర్ లో టిడిపి నేత,మాజీ మంత్రి జవహర్...
- మద్యపాన నిషేధం పేరుతో జగన్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ మద్యం దందా ని బయటపెట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రకాష్ ని బలితీసుకున్నారు.
- లక్షణంగా ఉన్న యువకుడు అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రభుత్వం.
- వైసీపీ ముఖ్య నాయకుల బెదిరింపులు, వేధింపుల వలనే ఓం ప్రకాష్ చనిపోయాడు.
- అసలు నిజాలు బయటకు రాకుండా, కేసు నమోదు చెయ్యకుండా, పోస్ట్ మార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు పూర్తి చేసారు.
- విషయం బయటకి వచ్చిన తరువాత హడావిడిగా కేసు నమోదు చేసి, పోస్ట్ మార్టం నిర్వహిస్తాం అంటున్నారు.
- కనీసం ఇప్పుడు నిజాలను బయటపెడతారా లేక వాస్తవాలను కూడా పూడ్చేస్తారా?
Janasena: సేవా కార్యక్రమాలకు జనసేన అధినేత పవన్ కల్యాన్ కేడర్ కు పిలుపు
తూర్పు గోదావరి:
రాజమండ్రి: తన పుట్టినరోజు పురస్కరించుకొని వారంరోజుల పాటు సేవా కార్యక్రమాలకు జనసేన అధినేత పవన్ కల్యాన్ కేడర్ కు పిలుపు
తొలిరోజు రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులలో కొవిడ్ పేషెంట్స్ కోసం 350 ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ.
రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఆరు గ్యాస్ సిలిండర్లను అందజేసిన జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్., పాల్గొన్న జనసేన నేతలు అత్తి సత్యనారాయణ, మల్లిరెడ్డి శ్రీనివాస్, ఏడిద బాబి..
వచ్చే నెల 2వ తేదీ వరకూ వివిద దశలలో సేవా కార్యక్రమాలు జనసైనికులు నిర్వహిస్తారు-- జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్.
East Godavari Updates: ప్రత్తిపాడులో ఓ ఇంట్లో తాచుపాము హల్చల్
తూర్పు గోదావరి జిల్లా
- ప్రత్తిపాడులో ఓ ఇంట్లో తాచుపాము హల్చల్
- పాములు పట్టే ఒక అతన్ని ఆశ్రయించిన ఇంటి యజమాని
- దాన్ని పట్టుకుని దూరంగా వదిలిపెట్టాడు..
Ibrahimpatnam: థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం
కృష్ణా జిల్లా
- ఇబ్రహీంపట్నం లోని డాక్టర్ నార్లతాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం
- ఒక కార్మికునికి తీవ్ర గాయాలు, చికిత్స నిమిత్తం తొలుత బోర్డు హస్పటల్ కి తీసుకుని వెళ్ళిన కార్మికులు.
- తలకు బలమైన గాయాలు కావటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ కు తరలింపు
Guntur District updates: ఏపి రాజధాని అమరావతి అంశం పై హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి.....
గుంటూరు...
-ఏపి రాజధాని అమరావతి అంశం పై హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి.....
-వచ్చేనెల 21కు వాయిదా వేసిన హైకోర్టు.....
-21తర్వాత రోజు విచారిస్తామన్న హైకోర్టు.....
-కౌంటర్ ధాఖలు చేయాలని సిఏస్ కు హైకోర్టు అదేశాలు....
-వచ్చే నెల 21వరకు స్టేటస్ కో కొనసాగుతుంది....
-స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కౌంటర్ ధాఖలు చేయాలని...సిఎస్ కు హైకోర్టు అదేశాలు ఇచ్చింది...
-హెచ్ఎంటివి తో హైకోర్టు న్యాయవాది నర్ర శ్రీనివాస్...
Amaravati updates: విజయవాడ క్యాంప్ కార్యాలయం లో ఇరిగేషన్ అధికారులతో మంత్రి అనిల్ కుమార్ సమావేశం..
అమరావతి...
-విజయవాడ క్యాంప్ కార్యాలయం లో ఇరిగేషన్ అధికారులతో మంత్రి అనిల్ కుమార్ సమావేశం..
-RRR స్కీమ్ కింద రాష్ట్రంలో ఉన్న MI టాంక్స్ మీద మైనర్ ఇరిగేషన్, కాడ అధికారులతో సమావేశం...
Anantapur district updates: మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కరోనా వ్యాధి నుంచి కోలుకోవాలని పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు....
అనంతపురం:
-అనంతపురం: మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కరోనా వ్యాధి నుంచి కోలుకోవాలని ఓ.డి చెరువు అభయాంజనేయ స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు సమర్పించి పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు.