LIVE UPDATES: ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవం

ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ పతకం లభించింది. రష్మిక-విజయ్ దేవరకొండల వివాహ వేడుకలు ఉదయ్ పూర్ లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఏపీ , తెలంగాణా నుంచి జాతీయ అంతర్జాతీయం వరకూ తాజా వార్తలు ఎప్పటికప్పుడు..

Update: 2026-02-26 01:15 GMT

HMTV Live Updates 26.02.2026

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ స్థాయిలో వస్తున్న తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీముందుంచుతుంది HMTV Live. ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవం లభించింది. టాలీవుడ్ స్టార్ జంట రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలు ఉదయ్ పూర్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఇలాంటి ఎన్నో విశేషాలను ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు .

Live Updates
2026-02-26 02:50 GMT

సూర్యాపేట జిల్లా..

  • కోదాడ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..
  • ​చిలుకూరులో 'యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్' రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
  • ​రూ.10 కోట్లతో కీతవారిగూడెం -వెలిదండ - మునగాల రోడ్డు విస్తరణ పనుల ప్రారంభం..

2026-02-26 02:09 GMT

ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో కింది లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు 


Gold Price Today : అమ్మో బంగారం.. నేడు హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు రేట్లు ఇవే!


2026-02-26 02:05 GMT

అనకాపల్లి జిల్లా:

  • వి.మాడుగుల మండలం ఎమ్.కోటపాడు వద్ద ఘటన
  • అదుపుతప్పి కరెంటు స్థంభాన్ని ఢీకొట్టిన ప్రయివేటు స్కూల్ బస్....
  • డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

2026-02-26 02:02 GMT

  • చంద్రగ్రహణం సందర్భంగా సింహాచల దేవస్థానంలో 3 వ తేదీన దర్శనాలు నిలిపివేత.
  • తిరిగి 4 వ తేదీ ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకి దర్శనాలు ప్రారంభం.

2026-02-26 02:01 GMT

  • ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న శాసనసభ సమావేశాలు.
  • ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలు ప్రారంభించనున్న స్పీకర్..
  • శాసనసభలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...
  • అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెట్టనున్న మంత్రి అనగాని..
  • గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి డీఎస్ బీవీ స్వామి...సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేలా బిల్లు..
  • జలవనరుల శాఖ బడ్జెట్ డిమాండ్లను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి నిమ్మల...

2026-02-26 01:59 GMT

తిరుమల:

  • తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
  • శ్రీవారి సర్వ దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం
  • సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలలో వేచిఉన్న భక్తులు
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,035
  • తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,౦౯౦
  • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.48 కోట్లు

2026-02-26 01:32 GMT

  • కడప జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్ రోడ్డులోని దీప్ లాడ్జి లొ చెలరేగిన మంటలు
  • లాడ్జిలోని 22 గదులకు వ్యాపించిన మంటలు.. అలుముకున్న దట్టమైన పొగ
  • ప్రమాద సమయంలోలాడ్జి లొ 33 మంది
  • మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
  • ఒకరు మృతి మిగిలిన వారిని కాపాడిన పోలీస్, ఫైర్ సిబ్బంది

ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణం అని అనుమానం

సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న రాజంపేట ఎయస్పి రాంనాధ్ హెడ్జ్

2026-02-26 01:29 GMT

  • బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి...
  • ద్రోణి ప్రభావంతో ఈ రోజు ఏపీ లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు...
  • శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు,కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

2026-02-26 01:24 GMT

  • ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు బరాత్‌ కార్యక్రమం ఉంటుంది.
  • ఆ తర్వాత ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం రష్మిక- విజయ్ ల వివాహం జరుగుతుంది.
  • సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి రష్మిక- విజయ్ ల వివాహ వేడుక జరగనుంది.
  • మొత్తంమీద చూస్తే తెలుగు, కన్నడ రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక ను గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News