
HMTV Live Updates 26.02.2026
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ పతకం లభించింది. రష్మిక-విజయ్ దేవరకొండల వివాహ వేడుకలు ఉదయ్ పూర్ లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఏపీ , తెలంగాణా నుంచి జాతీయ అంతర్జాతీయం వరకూ తాజా వార్తలు ఎప్పటికప్పుడు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ స్థాయిలో వస్తున్న తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీముందుంచుతుంది HMTV Live. ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవం లభించింది. టాలీవుడ్ స్టార్ జంట రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకలు ఉదయ్ పూర్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఇలాంటి ఎన్నో విశేషాలను ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు .
Live Updates
- 26 Feb 2026 2:50 AM GMT
Telangana: కోదాడ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన
సూర్యాపేట జిల్లా..
- కోదాడ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..
- చిలుకూరులో 'యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్' రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
- రూ.10 కోట్లతో కీతవారిగూడెం -వెలిదండ - మునగాల రోడ్డు విస్తరణ పనుల ప్రారంభం..
- 26 Feb 2026 2:09 AM GMT
Gold Price Today: భగ్గుమన్న బంగారం ధరలు
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో కింది లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
Gold Price Today : అమ్మో బంగారం.. నేడు హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు రేట్లు ఇవే!
- 26 Feb 2026 2:05 AM GMT
Anakapalli District: కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టిన స్కూలు బస్సు
అనకాపల్లి జిల్లా:
- వి.మాడుగుల మండలం ఎమ్.కోటపాడు వద్ద ఘటన
- అదుపుతప్పి కరెంటు స్థంభాన్ని ఢీకొట్టిన ప్రయివేటు స్కూల్ బస్....
- డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- 26 Feb 2026 2:02 AM GMT
Simhachalam: మార్చి 3న అప్పన్న ఆలయం మూసివేత
- చంద్రగ్రహణం సందర్భంగా సింహాచల దేవస్థానంలో 3 వ తేదీన దర్శనాలు నిలిపివేత.
- తిరిగి 4 వ తేదీ ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకి దర్శనాలు ప్రారంభం.
- 26 Feb 2026 2:01 AM GMT
Andhra Pradesh Assembly: అసెంబ్ల సమావేశాల్లో ఈరోజు
- ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న శాసనసభ సమావేశాలు.
- ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలు ప్రారంభించనున్న స్పీకర్..
- శాసనసభలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం...
- అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెట్టనున్న మంత్రి అనగాని..
- గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి డీఎస్ బీవీ స్వామి...సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేలా బిల్లు..
- జలవనరుల శాఖ బడ్జెట్ డిమాండ్లను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి నిమ్మల...
- 26 Feb 2026 1:59 AM GMT
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల:
- తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
- శ్రీవారి సర్వ దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం
- సర్వదర్శనానికి 25 కంపార్ట్ మెంట్లలలో వేచిఉన్న భక్తులు
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,035
- తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,౦౯౦
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.48 కోట్లు
- 26 Feb 2026 1:32 AM GMT
Andhra Pradesh: కడప జిల్లా రాజంపేటలో అగ్నిప్రమాదం
- కడప జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్ రోడ్డులోని దీప్ లాడ్జి లొ చెలరేగిన మంటలు
- లాడ్జిలోని 22 గదులకు వ్యాపించిన మంటలు.. అలుముకున్న దట్టమైన పొగ
- ప్రమాద సమయంలోలాడ్జి లొ 33 మంది
- మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
- ఒకరు మృతి మిగిలిన వారిని కాపాడిన పోలీస్, ఫైర్ సిబ్బంది
ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణం అని అనుమానం
సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న రాజంపేట ఎయస్పి రాంనాధ్ హెడ్జ్
- 26 Feb 2026 1:29 AM GMT
Weather Update: ఏపీలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం
- బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి...
- ద్రోణి ప్రభావంతో ఈ రోజు ఏపీ లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు...
- శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు,కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
- 26 Feb 2026 1:25 AM GMT
రష్మిక - విజయ్ దేవరకొండ హల్దీ వేడుకలను ఈ ట్వీట్ లో చూడొచ్చు
VIROSH - HALDI 💛🥹🧿✨#weddingofvirosh🥳@TheDeverakonda@iamRashmika
— yourash143 (@yourash2006) February 25, 2026
tags#vijaydevarakonda #rashmikamandanna #virosh #vijayandrashmika#geethagovindam #dearcomrade pic.twitter.com/otKN4ujtac - 26 Feb 2026 1:24 AM GMT
రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి ముహూర్తం ఇదే
- ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుంది.
- ఆ తర్వాత ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం రష్మిక- విజయ్ ల వివాహం జరుగుతుంది.
- సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి రష్మిక- విజయ్ ల వివాహ వేడుక జరగనుంది.
- మొత్తంమీద చూస్తే తెలుగు, కన్నడ రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక ను గ్రాండ్గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




