logo

Read latest updates about "తాజా వార్తలు" - Page 1

తెలుగు రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్

2019-01-21T20:17:10+05:30
ఫిబ్రవరి నాటికి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. టీచర్ల నియామకాల్లో జాప్యం జరుగుతుందని దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారించింది.

పడవ బోల్తా; 8 మంది మృతి

2019-01-21T19:19:56+05:30
కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కార్వార్ సమీపాన సముద్రంలో పడవ మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

బుద్గాంలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు తీవ్రవాదులు హతం..

2019-01-21T19:13:58+05:30
జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. చారీ షరీఫ్‌‌లోని జిన్‌పాంచల్ వద్ద ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు.

పంచాయతీ ఫలితాల్లో దుమ్మురేపిన కారు!

2019-01-21T19:12:32+05:30
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా సాగాయి. ఉదయం నుండే పోలింగ్ బూత్ ల్లో ఓటు వేసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. కాగా తెలంగాణ ఎర్పడిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడం విశేషంజ అయితే తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దుమ్మురేపుతోంది.

2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన కీలకనేత!

2019-01-21T18:23:54+05:30
ఇటివల బొత్స ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో బొత్స సత్యనారాయణ తాను పోటీ చేసే నియోజకవర్గం, అలాగే రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు.

మెట్రో ప్రయాణికులకు ఉచితంగా నూడిల్స్

2019-01-21T18:05:05+05:30
మెట్రో రైలు కంపెనీ మరో వినూత్న పథకాన్నీ అమల్లోకి తీసుకొచ్చింది. టోక్పో మెట్రో రైలు కంపెనీ బాగా రద్దీ సమయంలో ప్రయాణీకుల సంఖ్య తగ్గించేందుకే ఈ పథకం తీసుకొచ్చిందంట.

జనసేనలో చేరిన భాజపా ఎమ్మెల్యే

2019-01-21T17:36:30+05:30
రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. ఆకుల సత్యనారాయణకు విజయవాడలో కండువా కప్పి పార్టీలోకి పవన్‌ ఆహ్వానించారు. రాజమండ్రి నుంచి భారీ ర్యాలీతో విజయవాడ చేరుకున్న ఆకుల సత్యనారాయణ పవన్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.

ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారా..?

2019-01-21T17:25:25+05:30
వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ఒక్కసారిగా నైరాశ్యం నెలకొంది. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదన్న కారణంతో రాజీనామా చేశారు రాధా. అయితే...

టీడీపీ నేతలకు నితిన్‌ గడ్కరీ సవాల్‌

2019-01-21T17:21:47+05:30
దేశ ప్రధానులుగా ఇప్పటి వరకు పనిచేసిన ఎవరి హయాంలోనూ అందనంత సాయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం అందించిందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరి అన్నారు. విజయవాడలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గడ్కరి ఏపీ అభివృద్ధి విషయంలో ఏమైనా అనుమానాలుంటే లెక్కలతో సహా చెప్పగనని టీడీపీ నాయకులకు సవాల్‌ విసిరారు.

స్వైన్‌ప్లూ కలకలం

2019-01-21T17:15:49+05:30
మంచిర్యాల జిల్లాలో స్వైన్‌ ఫ్లూ కలకలం రేపింది. లక్షెట్టిపేటలో ఓ కాలనీకి చెందిన మహిళకు గత 10 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది.

ధర్మవరంలో వైసీపీకి భారీ షాక్‌

2019-01-21T17:03:41+05:30
అనంతపురం ధర్మవరం పట్టణంలో వైసీపీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు జరీ సుబ్రహ్మణ్యం , తన అనుచరులతో పాటు ఏకంగా 200 కుటుంబాలు తెదేపా పార్టీ తీర్థంపుచ్చుకున్నాయి.

విజయవాడలో కలకలం రేపుతున్న బాక్స్

2019-01-21T16:35:52+05:30
విజయవాడలో అనుమానాస్పద బాక్స్ ను టాస్క్ ఫోర్స్ గుర్తించింది. బాక్సులో ప్రమాదకరమైన ఇరీడియం, యూరేనియం మెటీరియల్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top