EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఈ పని చెయ్యకపోతే ఇబ్బందులు తప్పవు…!

EPFO Aadhaar Link
x

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..ఈ పని చెయ్యకపోతే ఇబ్బందులు తప్పవు…!

Highlights

Link Aadhaar with UAN Online: ప్రైవేట్ రంగంలో పనిచేసే కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తు నిధిని ఈపీఎఫ్‌వో (EPFO) నిర్వహిస్తుంది.

Link Aadhaar with UAN Online: ప్రైవేట్ రంగంలో పనిచేసే కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తు నిధిని ఈపీఎఫ్‌వో (EPFO) నిర్వహిస్తుంది. గతంలో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయాలన్నా లేదా లోన్ తీసుకోవాలన్నా నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ మయం. ఈ ఆన్‌లైన్ సేవలను వేగంగా పొందాలంటే మీ యూఎఎన్ నెంబర్‌కు ఆధార్ కార్డును లింక్ చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

చాలామంది ఆధార్ లింక్ చేయడాన్ని వాయిదా వేస్తుంటారు. కానీ దీనివల్ల కొన్ని తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. అత్యవసర సమయంలో పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ఆధార్ లింక్ లేకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ బదిలీ చేయడం కష్టమవుతుంది. ఆధార్ లింక్ లేని ఖాతాల్లో కంపెనీ కంట్రిబ్యూషన్ లేదా వడ్డీ జమ కావడంలో సాంకేతిక సమస్యలు రావచ్చు.

మీ యూఎఎన్ మరియు ఆధార్‌ను అనుసంధానించే ముందు డేటా మ్యాచ్ అనేది చాలా ముఖ్యం.మీ పీఎఫ్ అకౌంట్‌లో పేరు ఎలా ఉందో, ఆధార్‌లో కూడా అలాగే ఉండాలి (స్పెల్లింగ్‌తో సహా).ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ మీ దగ్గరే ఉండాలి, ఎందుకంటే వెరిఫికేషన్ కోసం ఓటీపీ వస్తుంది. పురుష/స్త్రీ వివరాలు కూడా రెండు చోట్లా ఒకేలా ఉండాలి.

మీరు ఇంటి నుంచే మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఈ పనిని పూర్తి చేయవచ్చు.ముందుగా EPFO యూనిఫైడ్ పోర్టల్ కు వెళ్లాలి.మీ యూఎఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. మెనూలో ఉన్న Manage ట్యాబ్ క్లిక్ చేసి, KYC ఆప్షన్‌ను ఎంచుకోండి.అక్కడ Aadhaar సెలెక్ట్ చేసి, మీ ఆధార్ నెంబర్ మరియు పేరు నమోదు చేయండి. తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది. మీ యజమాని దీనిని అప్రూవ్ చేసిన తర్వాత లింక్ ప్రక్రియ పూర్తవుతుంది.

ఒకవేళ వివరాలు తప్పుగా ఉండటం వల్ల లింక్ రిజెక్ట్ అయితే, పోర్టల్‌లో Modify Basic Details ఆప్షన్ ద్వారా ముందుగా మీ వివరాలను సవరించుకోవాలి. ఈపీఎఫ్‌వో డేటా అప్‌డేట్ అయిన తర్వాత మళ్ళీ ఆధార్ లింక్ చేయడానికి ప్రయత్నించాలి.ఆధార్ లింక్ చేయడం వల్ల మీ పీఎఫ్ ఖాతాకు భద్రత పెరగడమే కాకుండా, పెన్షన్ సేవలు కూడా సులభతరం అవుతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ స్టేటస్ చెక్ చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories