Optical Illusion Challenge: కనిపెట్టండి చూద్దాం..!

Optical Illusion Challenge: కనిపెట్టండి చూద్దాం..!
x

Optical Illusion Challenge: కనిపెట్టండి చూద్దాం..!

Highlights

Optical Illusion Challenge: కనిపెట్టండి చూద్దాం..!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూడటానికి కేవలం సాధారణ చిత్రాలలాగే అనిపించినా, వాటిలో దాగున్న రహస్యాలను ఛేదించడం అందరికీ సాధ్యం కాదు. పది మందిలో ఒకరు మాత్రమే ఇలాంటి పజిల్స్‌ను సరిగ్గా పరిష్కరించగలరని నిపుణులు చెబుతుంటారు. ఈ చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, మీ మెదడుకు పదును పెట్టి, మీ పరిశీలనా శక్తికి పరీక్ష పెడతాయి. తాజాగా అలాంటి ఒక గమ్మత్తైన చిత్రం నెట్టింట వైరల్ అవుతోంది.

పైన ఇచ్చిన చిత్రంలో ఒక చెట్టు కొమ్మ మీద హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న చిరుతపులి కనిపిస్తుంది. అయితే, అదే చెట్టు పరిసరాల్లో ఎక్కడో ఒక చేప కూడా దాక్కుని ఉంది. సాధారణంగా చేపలు నీటిలో ఉండాలి, కానీ ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మాత్రం అది చెట్టు మీద ఒకచోట గమ్మత్తుగా కలిసిపోయింది. మీ ఛాలెంజ్ ఏంటంటే.. కేవలం 10 సెకన్లలో మీరు ఆ చేపను కనిపెట్టాలి. నిజానికి ఇది సింపుల్ ఛాలెంజ్ కాదు. పైన ఇచ్చిన చిత్రాన్ని చాలా నిశితంగా, ఏకాగ్రతతో గమనిస్తే తప్ప ఆ చేప ఎక్కడ ఉందో మీకు దొరకదు. ఒకవేళ మీరు ఇచ్చిన సమయంలో చేపను గుర్తిస్తే, మీ కంటి చూపు అత్యద్భుతంగా ఉన్నందని అర్థం. ఒకవేళ మీరు ఇంకా వెతుకుతూనే ఉంటే, చిత్రంలో చేప ఎక్కడ ఉందో మేము మార్క్ చేసి ఇస్తున్నాము చూడండి. మీరు గుర్తించిన చేప, మేము మార్క్ చేసింది ఒకటేనా అని చూసుకోండి. మీకు ఈ పజిల్ నచ్చితే.. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories