TTD : శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్.. వెంటనే ఆన్‌లైన్ వేలంలో పాల్గొనండి

శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్.. వెంటనే ఆన్‌లైన్ వేలంలో పాల్గొనండి

Update: 2026-02-26 01:54 GMT

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. కలియుగ వైకుంఠనాథుడైన వేంకటేశ్వరస్వామికి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన వస్త్రాలను సొంతం చేసుకునే భాగ్యం ఇప్పుడు భక్తులకు దక్కనుంది. తిరుమలతో పాటు టిటిడికి అనుబంధంగా ఉన్న ఇతర ఆలయాల్లో స్వామివారికి కానుకగా వచ్చిన వస్త్రాలను ఈ-వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఆన్‌లైన్ వేలం ప్రక్రియ ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా పాల్గొని శ్రీవారి ప్రసాదంగా భావించే ఈ వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు.

ఈ వేలంలో కేవలం కొత్త వస్త్రాలే కాకుండా, స్వామివారికి అలంకరించినవి, భక్తులు హుండీలో వే సినవి, స్వల్పంగా దెబ్బతిన్న వస్త్రాలను కూడా ఉంచనున్నారు. ఇందులో పట్టు చీరలు, హాఫ్ సారీస్, ఆర్ట్ సిల్క్, కాటన్ చీరలు, ఇతర వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ వేలం పాటలు మార్చి 9వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతాయి. స్వామివారి వస్త్రాలను తమ ఇంట్లో ఉంచుకోవాలని ఆశపడే భక్తులకు ఇదొక గొప్ప అవకాశమని టీటీడీ పేర్కొంది.

ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-కొనుగోలు పోర్టల్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org ని సందర్శించవచ్చు లేదా 0877-2264429, 9959988470 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. కేవలం వస్త్రాలే కాకుండా, ఆలయాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత వస్తువులను కూడా తొలగించేందుకు టీటీడీ సిద్ధమైంది. దీనిపై టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహిస్తూ.. ప్రతి డిపార్ట్‌మెంట్ తమ వద్ద ఉన్న పాత సామాగ్రి వివరాలను 15 రోజుల్లోగా అందించాలని ఆదేశించారు. వీటిని కూడా నిబంధనల ప్రకారం వేలం వేసి విక్రయించనున్నారు.

మరోవైపు, తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ వినూత్నంగా అభిప్రాయ సేకరణ చేపడుతోంది. స్వామివారి దర్శనం, అన్నప్రసాదం, రవాణా సౌకర్యాలు, వసతి గదులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై భక్తులు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారో తెలుసుకునేందుకు ఈ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. దీనికి భక్తుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని జేఈఓ తెలిపారు. భక్తులు ఇచ్చే సూచనల ఆధారంగా తిరుమలలో సేవలను మరింత మెరుగుపరుస్తున్నామని, ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని వెళ్లేలా చూడటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News