LIVE UPDATES: ఏపీని కుదిపేస్తున్న శీకాకుళం డయేరియా కేసుల వ్యవహారం
శ్రీకాకుళం డయేరియా వ్యాప్తి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఏపీ , తెలంగాణా తాజా వార్తలు ఎప్పటికప్పుడు..
LIVE UPDATES
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ స్థాయిలో వస్తున్న తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీముందుంచుతుంది HMTV Live. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో డయేరియా కేసులు ఈరోజు పెద్ద అంశంగా మారాయి. అదేవిధంగా రాజమహేంద్రవరంలో కల్తీపాలు తాగి ఆరుగురు మృతి చెందడం ఆందోళన రేకెత్తిస్తోంది. తెలంగాణాలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వద్ద చెట్లను నరికివేసిన ఉదంతం రాజకీయంగా విమర్శలతో హోరెత్తిపోతోంది . ఇలానే ఎన్నో విశేషాలను ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు .
2026-02-25 11:03 GMT
- ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు
- నలుగురు చనిపోయారని ధర్మాన ప్రసాదరావు చెప్పడం హాస్యాస్పదం
- డయేరియాతో చనిపోయారు అంటున్న ఆ నలుగురి వివరాలు ఇవ్వండి
- ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా డయేరియా పరిధిలోకి తీసుకురావడం కరెక్ట్ కాదు
- ఎప్పుడు రాని ధర్మాన ఇప్పుడు వీధిలో తిరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా ఆయన రోడ్డుపైకి వచ్చారా ?
- ప్రభుత్వం చర్యలతో స్థానికలంతా చాలా ఆనందంగా ఉన్నారు
2026-02-25 11:00 GMT
- శ్రీకాకుళం పట్టణంలో డయేరియా కంట్రోల్లోనే ఉంది
- ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాం
- ఇప్పటివరకు 65 మందికి మాత్రమే డయేరియా సోకింది
- డయేరియా స్ప్రెడ్ అయితే వందల కొద్ది కేసులు బయటపడి ఉండేది
- అధికారులు వెంటనే స్పందించి డయేరియాను కంట్రోల్ చేశారు
2026-02-25 10:59 GMT
- చేజర్ల మండలం ఆదురుపల్లి గురుకుల పాఠశాల వద్ద చెట్టును ఢీకొన్న కారు.
- ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం.
- బాధితుణ్ణి 108 లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు
2026-02-25 10:41 GMT
- ఎవరైనా మీ ఎదుట వేరే పార్టీ కండువా కప్పుకొని కనపడితేనే మీరు సస్పెండ్ చేయవచ్చు.
- అలాంటిది నా రాజీనామా విషయంలో మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదనీ చైర్మన్ ని ప్రశ్నించితిన్ వెంకటరమణ
- మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టారా లేక రాజీనామా చేయమని బెదిరించారా అని వెంకటరమణను అడిగిన మండలి చైర్మన్.
- అలాంటిదేమీ లేదు నేను స్వచ్ఛందంగానే వైసీపీ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాననీ తెలిపిన జయ మంగళం.
2026-02-25 10:40 GMT
- తన రాజీనామా ఆమోదించమని కోరిన వెంకట రమణ
- తాను వైసిపికి రాజీనామా చేసి జనసేనలో చేరినట్లు శాసనమండలి చైర్మన్ కు వివరించిన వెంకటరమణ
- తాను ఇప్పటికే జనసేన పార్టీలో అధికారికంగా జాయిన్ అయినట్టు స్పష్టం చేసిన వెంకటరమణ
2026-02-25 10:10 GMT
- మడకశిర పంట పొలాల్లో పేలుడు పదార్దాలు దొరికిన వైనంపై స్పందించిన ఎమ్మెల్యే MS రాజు
- లీగల్ పేలుడు పదార్దాలలో పని చేసే వ్యక్తి ఇల్లీగల్ గా చేస్తున్నాడని సమాచారం తెలిసింది
- దీనికి అతని బంధువు ఒక హోమ్ గార్డ్ సహకరించారు
- వాళ్ళిద్దరి మీద కేసు నమోదు చేస్తారు.
2026-02-25 10:06 GMT
- విశాఖ పట్నం లో త్వరలో ల్యాబ్ ను ప్రారంభిస్తాం.గుంటూరు,తిరుపతి లో ప్రాసెస్ లో ఉంది.
- తిరుమలలో టిటిడి సహకారం తో ల్యాబ్ ను ఇప్పటికే ఏర్పాటు చేసాము.
- వీలైంత త్వరగా కల్తీ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం.
2026-02-25 10:04 GMT
- ప్రస్తుతం ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేసిన తర్వాత స్వీకరించిన శాంపిల్స్ ని హైదరాబాద్ పంపించాల్సి వస్తోంది.
- 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ముగియడంతో పరీక్షల కోసం పైసలు కట్టాల్సిన పరిస్థితి.
2026-02-25 10:02 GMT
- ఫుడ్ సేఫ్టీ కి సంబంధించిన సిబ్బంది కొరత ఉంది, అలాగే ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
- కేంద్రప్రభుత్వ అనుమతి తో కొత్త సిబ్బంది నీ నియమించేందుకు పూర్తి గా దృష్టి సారిస్తున్నాము..
- కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు ల్యాబ్ లను మంజూరు చేసింది.
2026-02-25 10:01 GMT
- రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం పై వైద్య బృందం అధ్యయనం చేస్తోంది...
- కల్తీ పాల సంఘటనల కంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేస్తున్నారు...