2026-02-25 10:02 GMT
అసెంబ్లీలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిట్ చాట్...
- ఫుడ్ సేఫ్టీ కి సంబంధించిన సిబ్బంది కొరత ఉంది, అలాగే ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
- కేంద్రప్రభుత్వ అనుమతి తో కొత్త సిబ్బంది నీ నియమించేందుకు పూర్తి గా దృష్టి సారిస్తున్నాము..
- కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు ల్యాబ్ లను మంజూరు చేసింది.
2026-02-25 10:01 GMT
అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిట్ చాట్...
- రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం పై వైద్య బృందం అధ్యయనం చేస్తోంది...
- కల్తీ పాల సంఘటనల కంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేస్తున్నారు...
2026-02-25 10:00 GMT
అసెంబ్లీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చిట్ చాట్...
శ్రీకాకుళం లో వాటర్ కంటామినేషన్ వలనే డయేరియా కేసులు..
ప్రస్తుతం పరిస్తితి పూర్తి గా అదుపులో ఉంది...
2026-02-25 09:56 GMT
బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం
- బెంగళూరులోని చిక్కపేట దగ్గరలోని కంబారపేటలో ఘటన
- 175 షాపులున్న బిల్డింగ్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
- మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
2026-02-25 09:53 GMT
హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం
కమ్ముకున్న దట్టమైన మేఘాలు
పూర్తి వార్తను ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు
2026-02-25 09:44 GMT
రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్
- రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణ పై తొలగింపు వేటు
- కల్తీ పాల బాధితులకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంపై విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్
- గత కొన్ని నెలలుగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్యంపై వరుస వివాదాలు
- కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
2026-02-25 09:42 GMT
శ్రీకాకుళం డయేరియా వ్యాప్తి కలకలం
శ్రీకాకుళం జిల్లా:
- శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్ హనుమంతు కూర్మారావు ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
- అతిసార వ్యాప్తి లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కమీషనర్ పై వేటు..
- ఇటీవలే మున్సిపల్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన కూర్మారావు