Hyderabad Weather Alert: హైదరాబాద్‌పై నల్ల మబ్బులు.. ఉప్పల్, ఎల్బీనగర్‌లో వర్ష సూచన

Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణ మార్పు. ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో దట్టమైన మబ్బులు కమ్మి, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక.

Update: 2026-02-25 09:40 GMT

Hyderabad Weather Alert: హైదరాబాద్‌పై నల్ల మబ్బులు.. ఉప్పల్, ఎల్బీనగర్‌లో వర్ష సూచన

హైదరాబాద్ నగరంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారాయి. ఉదయం వరకు ఎండ తీవ్రత కనిపించినప్పటికీ మధ్యాహ్నం సమయానికి ఆకాశాన్ని నల్లటి మబ్బులు కమ్మేశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా చీకటి వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

ప్రధానంగా ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో దట్టమైన మబ్బులు కమ్ముకుని చల్లని గాలులు వీచుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇటీవలి రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ నిపుణులు సూచించిన నేపథ్యంలో నగర వాతావరణం ఒక్కసారిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఎండగా ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకోవడం గమనార్హం.

ఉత్తర హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రస్తుతం సుమారు 29 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో చల్లదనం ఉండగా, పగటి వేళల్లో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇదిలా ఉండగా నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడి వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇటీవల అర్ధరాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News