T20 World Cup 1st Semi Finals LIVE Updates: దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
T20 World Cup 1st Semi Finals LIVE Updates: టీ20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా తో న్యూజిలాండ్ తలపడుతుంది. లీగ్ దశలో సౌతాఫ్రికాతో ఎదురైన పరాజయానికి కివీస్ బదులు ఇస్తుందా ?
T20 World Cup 1st Semi Finals LIVE Updates
T20 World Cup 1st Semi Finals LIVE Updates: T20 ప్రపంచ కప్‌లో మొదటి సెమీఫైనల్ ఈరోజు దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా వేగంగా 5 వికెట్లు కోల్పోయింది.
ప్రపంచ కప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇది ఆరో మ్యాచ్. గతంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయితే, ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడటం మాత్రం ఇదే తొలిసారి.
ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా కొనసాగుతోంది. మరోవైపు, న్యూజిలాండ్ రెండు పరాజయాలను చవిచూసింది: గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఓటమిచూసింది. తరువాతగ సూపర్ 8లో ఇంగ్లాండ్‌పై ఓడిపోయింది.
ఈ మ్యాచ్ కు సంబంధించి లైవ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు
100 పరుగులు పూర్తి చేసిన కివీస్
హాఫ్ సెంచరీ చేసిన టిమ్ సీఫెర్ట్
- పవర్ ప్లే లో విజృంభించిన న్యూజిలాండ్ బ్యాటర్లు .
- వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసిన కివీస్
- ఆరో ఓవర్ లో 22 పరుగులు చేసిన అలెన్
ఆరో ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 84/0
టిమ్ సీఫెర్ట్: 41
ఫిన్ అలెన్: 43
ఆరో ఓవర్లో 22 పరుగులు చేసిన అలెన్
నాలుగో ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 48/0