NZ vs SA: సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఢీ.. చరిత్ర ఎవరివైపు ఉందో తెలుసా?

NZ vs SA: సెమీస్‌లో హాట్ ఫైట్‌కు సిద్ధమైన కివీస్–ప్రోటీస్.. గత రికార్డులు, గెలుపోటముల గణాంకాలు ఎవరికి అనుకూలమో ఆసక్తికర విశ్లేషణ

Update: 2026-03-03 11:19 GMT

NZ vs SA: సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఢీ.. చరిత్ర ఎవరివైపు ఉందో తెలుసా?

NZ vs SA: టీ20 వరల్డ్ కప్‌ 2026 బుధవారం మరో ఆసక్తికర పోరు జరగనుంది. తొలి సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. మార్చి 4న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరాలని ఇరు జట్లు చూస్తున్నాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీమ్స్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయ. కీలక నాకౌట్ మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల ఐసీసీ టోర్నీల రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం.

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు నాలుగోసారి ఐసీసీ ఈవెంట్‌లో తలపడబోతున్నాయి. గత మూడు సార్లూ కివీస్ విజయం సాధించడం విశేషం. 2011 వన్డే ప్రపంచ కప్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 49 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. కీలక సమయంలో కివీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి విజయం అందించారు. 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఉత్కంఠభరిత పోరు సాగింది. చివరి ఓవర్ల వరకు సాగిన మ్యాచ్‌లో కివీస్ 4 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. ఆ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే థ్రిల్లర్‌గా గుర్తింపు పొందింది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో మరోసారి న్యూజిలాండ్ ఆధిపత్యం చాటింది. ఈసారి 50 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గత రికార్డులు చూస్తే న్యూజిలాండ్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఈసారి గత పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీ టీమ్ భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ తమ విజయ పరంపర కొనసాగించాలని చూస్తోంది. ఈ కీలక పోరు క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరిత అనుభూతి కలిగించనుంది. చరిత్ర మళ్లీ పునరావృతమవుతుందా? లేక దక్షిణాఫ్రికాన కొత్త అధ్యాయం రాస్తుందా? అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News