Suryakumar Yadav Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్.. ఎలైట్ జాబితాలో సూర్యకు కూడా చోటు!
Suryakumar Yadav Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్.. ఎలైట్ జాబితాలో సూర్యకు కూడా చోటు!
Suryakumar Yadav Record
Suryakumar Yadav Record: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్సీ అంటే మామూలు విషయం కాదు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ముందుగా అనుకున్న ప్రణాళికలు పనిచేయకుంటే.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతటి ఒత్తిడిలోనూ కొందరు సారథులు అద్భుత విజయాలు అందుకున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో కెప్టెన్ల విజయాల గణాంకాలు ఆసక్తికరంగా మారాయి. ఆ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.
Suryakumar Yadav Record: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ 62 మ్యాచ్‌లలో భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఇందులో 50 విజయాలతో అగ్రస్థానంలో నిలిచాడు. భారత్ తరఫునే కాదు ప్రపంచ క్రికెట్‌లో కూడా రోహిత్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. ఇన్ని విజయాలు మరో ఆటగాడికి సాధ్యం కాలేదు. స్థిరమైన నాయకత్వం, ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో రోహిత్ ఈ ఘనత సాధించాడు. రెండో స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఉన్నాడు. 85 మ్యాచ్‌లలో 48 విజయాలు సాధించాడు. నమీబియా సారథి గెర్హార్డ్ ఎరాస్మస్ 80 మ్యాచ్‌లలో 48 విజయాలు అందుకున్నాడు.
ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా 59 మ్యాచ్‌లలో 44 విజయాలతో తదుపరి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా 72 మ్యాచ్‌లలో 44 విజయాలు సాధించి తన నాయకత్వ ప్రతిభను నిరూపించాడు. భారత దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 72 మ్యాచ్‌లలో 42 విజయాలతో ఏ జాబితాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ఆఫ్ఘానిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ స్టానిక్జాయ్ 52 మ్యాచ్‌లలో 42 విజయాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 76 మ్యాచ్‌లలో 41 విజయాలు సాధించగా.. భారత ప్రస్తుత నాయకుడు సూర్యకుమార్ యాదవ్ 50 మ్యాచ్‌లలో 40 విజయాలతో దూసుకొస్తున్నాడు. ఇన్ని తక్కువ మ్యాచ్‌లలో ఎక్కువ విజయాలు అందుకోవడం సూర్య నాయకత్వం ఎంత అద్భుతంగా ఉందో చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ ఎంత కీలకమో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విజయాల పరంగా రోహిత్ శర్మ ముందంజలో ఉండటం భారత అభిమానులకు గర్వకారణంగా మారింది.