Suryakumar Yadav Record: సూర్యకుమార్ అరుదైన ఘనత.. టీమిండియా దిగ్గజ కెప్టెన్స్ సరసన సూర్య భాయ్!
Suryakumar Yadav Record: భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని ప్రతి క్రికెటర్ కల కంటాడు. అయితే కొందరి కల మాత్రమే సాకారవుతుంది.
Suryakumar Yadav Record: సూర్యకుమార్ అరుదైన ఘనత.. టీమిండియా దిగ్గజ కెప్టెన్స్ సరసన సూర్య భాయ్!
Suryakumar Yadav Record: భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని ప్రతి క్రికెటర్ కల కంటాడు. అయితే కొందరి కల మాత్రమే సాకారవుతుంది. భారత క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ కాలం జట్టుకు నాయకత్వం వహించిన జాబితాలో దిగ్గజాలు ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో మైదానంలోకి దిగగా.. కెప్టెన్‌గా సూర్య భాయ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వివిధ ఫార్మాట్లలో 50కి పైగా మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన కెప్టెన్ల జాబితాలో సూర్యకు చోటు దక్కింది.
భారత మాజీ కెప్టెన్లలో కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజాలు వన్డేల్లో 50కిపైగా మ్యాచ్‌లకు జట్టును నడిపించారు. వీరిలో ప్రతి ఒక్కరు తమ నాయకీత్వంలో జట్టుకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టారు. మరోవైపు మూడు ఫార్మాట్లలోనూ 50కి పైగా మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన అరుదైన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు ఉన్నారు. ఈ ఇద్దరూ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకులుగా నిలిచారు. అలాగే రోహిత్ శర్మ వన్డే, టీ20ల్లో 50కి పైగా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి తన ప్రత్యేక ముద్ర వేశారు.
ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో 50 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ పేరు ఈ అరుదైన జాబితాలో చేరింది. టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ అంటే అంత సులువు కాదు. అప్పటికపుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయినా కూడా సూర్య సక్సెస్ అయ్యాడు. 2024 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత సూర్యకుమార్ జట్టు బాధ్యతలను చేపట్టాడు. సూర్య నాయత్వంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకుంది. దూకుడు బ్యాటింగ్‌తో పాటు సమర్థ నాయకత్వంతో జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
అన్ని ఫార్మాట్‌లో 50 మ్యాచ్‌లకు కెప్టెన్‌ల లిస్ట్:
కపిల్ దేవ్ (వన్డే)
ఎం అజారుద్దీన్ (వన్డే)
సచిన్ టెండూల్కర్ (వన్డే)
సౌరవ్ గంగూలీ (వన్డే)
రాహుల్ ద్రవిడ్ (వన్డే)
ఎంఎస్ ధోనీ (టెస్ట్, వన్డే, టీ20)
విరాట్ కోహ్లీ (టెస్ట్, వన్డే, టీ20)
రోహిత్ శర్మ (వన్డే, టీ20)
సూర్యకుమార్ యాదవ్ (టీ20)