IND vs WI Stats: ముందుగా బ్యాటింగ్ చేస్తే విండీస్‌కు పరాజయమే.. సంబరపడిపోతున్న టీమిండియా ఫాన్స్!
IND vs WI Stats: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా భారత్, వెస్టిండీస్ టీమ్స్ తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం.
IND vs WI Stats: ముందుగా బ్యాటింగ్ చేస్తే విండీస్‌కు పరాజయమే.. సంబరపడిపోతున్న టీమిండియా ఫాన్స్!
IND vs WI Stats: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా భారత్, వెస్టిండీస్ టీమ్స్ తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఇందులో గెలిస్తేనే సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే.. ఇది క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో విండీస్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. విండీస్ ముందుగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో గత గణాంకాలు తెరపైకి వచ్చాయి. భారత్‌లో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు విండీస్ జట్టు రికార్డు ఆశించినంతగా లేదు.
భారత మైదానాల్లో టీమిండియాపై తొలుత బ్యాటింగ్ చేసిన మ్యాచ్‌ల్లో కరేబియన్ జట్టు వరుస ఓటములు చవిచూసింది. ఈ గణాంకాలు చూస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం వెస్టిండీస్‌కు అంతగా కలిసిరాలేదని స్పష్టమవుతోంది. 2018లో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అదే ఏడాది చెన్నైలో జరిగిన మరో మ్యాచ్‌లో కూడా భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2019లో హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కూడా విండీస్ ముందుగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఫలితం మారలేదు. ఆ మ్యాచులో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక 2022లో మరోసారి కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఈ గణాంకాలు పరిశీలిస్తే.. భారత్‌లో చేజింగ్ చేయడం భారత జట్టుకు ఎంత సౌకర్యంగా ఉంటుందో, ఇట్టే అర్ధమవుతోంది. అలాగే ముందుగా బ్యాటింగ్ చేయడం విండీస్‌కు ఎంత కష్టమో తెలుస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో టాస్ గెలవడం టీమిండియాకు కలిసి వస్తుందని ఫాన్స్ నమ్ముతున్నారు. ముందుగా బ్యాటింగ్ చేస్తే విండీస్‌కు పరాజయమే అంటూ ఫాన్స్ సంబరపడిపోతుతున్నారు. ప్రస్తుతం విండీస్ 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 35 రన్స్ చేసింది. టీ20 ప్రపంచ కప్ 2026లో కరేబియన్లు ఓ ప్లాన్ ప్రకారం ఆడుతున్నారు. ముందుగా నెమ్మదిగా ఆడి ఆపై గేర్ మార్చి సిక్సులతో విరుచుకుపడుతున్నారు. అందరూ హిట్టర్లే కావడంతో భారీ స్కోర్ చేస్తోంది. చూడాలి మరి ఈరోజు ఏం జరుగుతుందో.