Shoaib Akhtar: వరల్డ్‌ కప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమణకు భారతే కారణం.. షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు!

Shoaib Akhtar: టీ20 వరల్డ్‌ కప్ 2026 గ్రూప్‌-2 సూపర్‌-8 మ్యాచ్‌లో భాగంగా శనివారం పల్లెకలెలో శ్రీలంకతో పాకిస్థాన్‌ తలపడింది.

Update: 2026-03-01 14:01 GMT

Shoaib Akhtar: వరల్డ్‌ కప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమణకు భారతే కారణం.. షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు!

Shoaib Akhtar: టీ20 వరల్డ్‌ కప్ 2026 గ్రూప్‌-2 సూపర్‌-8 మ్యాచ్‌లో భాగంగా శనివారం పల్లెకలెలో శ్రీలంకతో పాకిస్థాన్‌ తలపడింది. ఈ మ్యాచ్‌లో పాక్ 5 పరుగుల తేడాతో గెలిచింది. మొదట పాక్‌ 8 వికెట్లకు 212 పరుగులు చేయగా.. ఛేదనలో లంక 6 వికెట్లకు 207 పరుగులే చేసింది. వరల్డ్‌ కప్ నుంచి నిష్క్రమించడంతో పాకిస్థాన్ జట్టుకు గెలిచిన ఆనందం లేకుండా పోయింది. సెమీస్‌ చేరాలంటే.. 147 స్కోరు లోపు శ్రీలంకను కట్టడి చేయడంలో పాక్ విఫలమైంది. దాయాది రన్‌రేట్‌ (-0.123)గా ఉండగా.. న్యూజిలాండ్‌ 1.390తో సెమీఫైనల్‌ బెర్తు దక్కించుకుంది. పాక్ నిష్క్రమణపై ఆ దేశ మాజీలు స్పందింస్తున్నారు. మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ నిష్క్రమణకు భారతే కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్ 2026 వరల్డ్‌ కప్‌లో నిరాశాజనక ప్రదర్శన చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి భారత్ అని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. 'పాక్ ఆటగాళ్లకు తగినన్ని అంతర్జాతీయ అవకాశాలు, అనుభవం లభించడం లేదు. పాకిస్థాన్ ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి పెద్ద టోర్నీల్లో ఆడే అవకాశం లేదు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లు పెద్ద లీగ్‌ల్లో ఆడి అనుభవం సంపాదిస్తున్నారు. పాక్ ఆటగాళ్లకు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇతర దేశాల ఆటగాళ్లు ఐపీఎల్‌లో ప్రెషర్ మ్యాచ్‌లలో ఆడడంను అలవాటు చేసుకున్నారు. అందుకే వారు వరల్డ్‌ కప్ టోర్నీలలో బాగా ఆడుతున్నారు' అని అక్తర్ వివరించాడు.

'భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం కూడా పాకిస్థాన్ జట్టు అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. వరల్డ్‌ కప్‌ల్లో మాత్రమే దాయాది జట్లు తలపడటం వల్ల పోటీ స్థాయి తగ్గుతుంది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి జట్లు పాకిస్థాన్ పర్యటనలకు ప్రధాన జట్టు కాకుండా రెండో స్థాయి టీంలను పంపుతున్నాయి. బలమైన జట్లతో ఆడకపోతే.. పాకిస్థాన్ ఆటగాళ్లు ఎలా మెరుగుపడతారు. పాక్ ఆటగాళ్లకు కూడా ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నా. అంతర్జాతీయ క్రికెట్ అభివృద్ధి కోసం రాజకీయాలు దూరంగా ఉండాలి' అని షోయబ్ అక్తర్ కోరుతున్నాడు. అక్తర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News