T20 World Cup 2026: పాపం దక్షిణాఫ్రికా, ఎక్కడ ఆడాలో ఇంకా తెలియదు.. బీసీసీఐపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు!
T20 World Cup 2026: వేదికల గందరగోళంపై అక్తర్ ఫైర్.. షెడ్యూల్ క్లారిటీ లేకుంటే జట్లకు ఇబ్బందులేనంటూ విమర్శలు!
T20 World Cup 2026: పాపం దక్షిణాఫ్రికా, ఎక్కడ ఆడాలో ఇంకా తెలియదు.. బీసీసీఐపై అక్తర్ సంచలన వ్యాఖ్యలు!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కే ఐసీసీ ఎప్పుడూ అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలో కూడా బీసీసీఐకి ఐసీసీ అనుకూలంగా ఉందని పేర్కొన్నాడు. మెగా టోర్నీ షెడ్యూల్, వేదికల విషయంలో తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. భారత్ ఆడే మ్యాచ్‌ల వేదికలు ముందే ఫిక్స్ అయ్యాయని, సెమీస్ చేరిన దక్షిణాఫ్రికాకు ఇంకా ఎక్కడ ఆడాలో తెలియదు అని అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ షెడ్యూలింగ్‌లో స్పష్టమైన అసమానత కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు.
'ప్రస్తుతం గ్రూప్-1 పాయింట్స్ టేబుల్‌లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. అయినా కూడా సఫారీ టీమ్ సెమీఫైనల్ ఎక్కడ ఆడుతుందో తెలియకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అదే సమయంలో భారత్ మాత్రం తమ తదుపరి మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయో ముందుగానే తెలుసు. ఇది చాలా అన్యాయం. భారత్ మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వెస్టిండీస్‌తో ఆడుతుంది. ఒకవేళ సెమీ ఫైనల్‌కు చేరితే ముంబైలో, ఫైనల్‌కు చేరితే అహ్మదాబాదులో మ్యాచ్ ఉంటుందని ముందే నిర్ణయించబడింది' అని షోయబ్ అక్తర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
'ఒకవేళ పాకిస్తాన్ గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే కొలంబోకి మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఒకవేళ న్యూజీలాండ్ అర్హత సాధిస్తే కోల్‌కతాలోనే మ్యాచ్ ఆడుతుంది. ఇది షెడ్యూలింగ్‌లో స్పష్టమైన అసమానత. ఈ పరిస్థితులు చూస్తే ఐసీసీ నిర్ణయాలు సమానత్వానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒక జట్టుకు ముందే అన్ని వివరాలు తెలిసి, మరో జట్టు అనిశ్చితిలో ఉండటం సరైంది కాదు. ఐసీసీ ఎప్పుడూ బీసీసీఐకి అనుకూలంగా ఉంటుంది' అని పాక్ మాజీపేసర్ షోయబ్ అక్తర్ ఫైర్ అయ్యాడు. అక్తర్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే మరో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.