T20 World Cup: మొదలైన ఇంగ్లాండ్ - న్యూజీలాండ్ సమరం . . టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
T20 World Cup:నేడు జరిగే టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది
T20 World Cup
T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో మరో అతి పెద్ద మ్యాచ్ మొదలైంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్‌లో 8వ సూపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ కు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ గత మ్యాచ్ నుండి తన ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇంగ్లాండ్ ఒక మార్పు చేసింది, జామీ ఓవర్టన్ స్థానంలో రెహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఈ మ్యాచ్ కివీస్ టీమ్ కు చావో రేవో తేల్చే మ్యాచ్ కాగా, పాకిస్తాన్ కు కూడా కీలకంగా మారింది. టోర్నీలో రెండు జట్ల సెమీస్ భవితవ్యాన్ని ఈ మ్యాచ్ తేల్చనుండడంతో క్రికెట్ అభిమానుల్లో అత్యంత ఆసక్తి నెలకొంది.
రెండు జట్ల ప్లేయింగ్-11
ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (wk), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (c), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (wk), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (c), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.
ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ ఇప్పటివరకు 30 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో ఇంగ్లాండ్ 16 మ్యాచ్‌లు గెలిచింది, న్యూజిలాండ్ కేవలం 10 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. మూడు మ్యాచ్‌లు డ్రాగా, ఒకటి టైగా ముగిసింది.
T20 World Cup: ప్రపంచ కప్‌లో రెండు జట్లు ఏడు మ్యాచ్‌లు ఆడాయి. ఇంగ్లాండ్ నాలుగు, న్యూజిలాండ్ మూడు గెలిచాయి. అంటే ఇంగ్లాండ్ స్వల్ప ఆధిక్యం సాధించినా ఐసీసీ టోర్నీల్లో రెండు జట్లు సమఉజ్జీలుగానే ఉన్నాయి. ఈరోజు మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని సవాలు చేయగలుగుతుంది. అంతేకాకుండా సెమీస్ కి చేరే మార్గం క్లియర్ అవుతుంది.
ఈ రెండు జట్లు చివరిసారిగా 2022లో బ్రిస్బేన్‌లో తలపడ్డాయి, ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 20 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ తరపున హ్యారీ బ్రూక్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా ఉన్నాడు. అతను ఆరు మ్యాచ్‌ల్లో 172.64 స్ట్రైక్ రేట్‌తో 202 పరుగులు చేశాడు, అత్యుత్తమ స్కోరు 100.
T20 World Cup: ఇక ఇంగ్లాండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు, అతను ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 8.73 ఎకానమీ రేటుతో 10 వికెట్లు పడగొట్టాడు.
ఈ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టిమ్ సీఫెర్ట్ నిలిచాడు. ఆరు మ్యాచ్‌ల్లో 161.6 స్ట్రైక్ రేట్‌తో 181 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ స్కోరు 89 నాటౌట్.
బౌలింగ్‌లో, మాట్ హెన్రీ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు, 6 మ్యాచ్‌ల్లో 7.38 ఎకానమీ రేటుతో 6 వికెట్లు పడగొట్టాడు.