WI vs SA Super 8: దంచికొట్టిన మార్‌క్రమ్‌, డికాక్.. సూపర్-8లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా సునాయాస విజయం!

WI vs SA Super 8: టీ20 వరల్డ్‌కప్‌ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది.

Update: 2026-02-26 13:51 GMT

WI vs SA Super 8: దంచికొట్టిన మార్‌క్రమ్‌, డికాక్.. సూపర్-8లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా సునాయాస విజయం!

WI vs SA Super 8: టీ20 వరల్డ్‌కప్‌ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. విండీస్ నిర్ధేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 16.1 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్‌ దంచికొట్టాడు. 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 82 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్టార్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ (45 నాటౌట్), ఓపెనర్ క్వింటన్‌ డికాక్ (47) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్ రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఖాతాలో 2 పాయింట్స్ చేరాయి. దాదాపుగా సఫారీలు సెమీస్ చేరారు.

నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగగా.. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. రొమారియో షెఫర్డ్ (52 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదాడు. ఆల్‌రౌండర్‌ జాసన్ హోల్డర్ (49) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 83 పరుగులకే 7 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఈ జోడి ఆడుకుంది. ఎనిమిదో వికెట్‌కు ఇద్దరు కలిసి ఏకంగా 89 పరుగులు జోడించారు. స్టార్ బ్యాటర్లు బ్రాండన్ కింగ్ (21), షై హోప్ (16), రూథర్‌ఫోర్డ్ (12), హెట్‌మయర్ (2), రోవ్‌మన్ పావెల్ (9) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, కగిసో రబాడ 2, కార్బిన్ బాష్‌ 2 వికెట్లు పడగొట్టారు.

భారీ లక్ష ఛేదనలో దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్, ఐడెన్ మార్‌క్రమ్‌ ధాటిగా ఆడారు. విండీస్ బౌలర్లపై విరుచుకు పడుతూ బౌండరీల వర్షం కురిపించారు. దాంతో సఫారీ టీమ్ స్కోర్ పరుగులు పెట్టింది. డికాక్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 47 రన్స్ చేసి.. తృటిలో ఫిఫ్టీ మిస్ అయ్యాడు. 95 రన్స్ వద్ద దక్షిణాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. ఆపై మార్‌క్రమ్‌కు ర్యాన్ రికెల్టన్ జత కలిశాడు. ఇద్దరూ చెలరేగడంతో ప్రొటీస్ టీమ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సఫారీల సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. చివరి పోరులో జింబాబ్వేతో దక్షిణాఫ్రికా తలపడాల్సి ఉంది.

Tags:    

Similar News