IND vs ZIM: టీమిండియాదే బ్యాటింగ్.. రెండు మార్పులతో బరిలోకి భారత్, ఇక టార్గెట్ 250!

IND vs ZIM: టీ20 వరల్డ్‌కప్‌ 2026 సూపర్-8లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మరికొద్ది నిమిషాల్లో భారత్, జింబాబ్వే జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్‌ ఆరంభం కానుంది.

Update: 2026-02-26 13:55 GMT

IND vs ZIM: టీమిండియాదే బ్యాటింగ్.. రెండు మార్పులతో బరిలోకి భారత్, ఇక టార్గెట్ 250!

IND vs ZIM: టీ20 వరల్డ్‌కప్‌ 2026 సూపర్-8లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మరికొద్ది నిమిషాల్లో భారత్, జింబాబ్వే జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్‌ ఆరంభం కానుంది. టాస్‌ నెగ్గిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 'ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. సాధారణ చెన్నై వికెట్ కాదు ఇది. పిచ్ తేమగా కనిపిస్తోంది, సీమర్లకు ఇది మంచి అవకాశం. మేము భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగితే.. సూపర్ 8 అవకాశాలు మెరుగవుతాయి. మేం ఎంత ఒత్తిడిని అనుభవిస్తున్నామో, ప్రత్యర్థి భారత్ కూడా అంతే ఒత్తిడిలో ఉంది. తుది జట్టులో ఓ మార్పు చేశాం. క్రీమర్ స్థానంలో టినోటెండా మపోసా వచ్చాడు' అని రజా చెప్పాడు.

'జింబాబ్వే నిర్ణయంతో సంతోషంగా ఉన్నాం. ముందుగా బ్యాటింగ్ చేయాలని మేము అనుకున్నాం. మా ప్లేయర్స్ సిద్ధంగా ఉన్నారు. టీమ్ మూడ్ రిలాక్స్‌గా ఉంది. హార్దిక్ అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతను జట్టుకు ఏమి చేయగలడో అందరికి తెలుసు. ఈ రాత్రి మాకు కలిసొస్తుందని భావిస్తున్నాను. గెలిచినా, ఓడినా ఏదో ఒకటి నేర్చుకుంటాము. గత మ్యాచులో ఏమి జరిగిందో మర్చిపోయాం. గత సంవత్సరంగా ఆడుతున్న విధంగానే ఆడతాం. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. వాషింగ్టన్ స్థానంలో అక్షర్, రింకు స్థానంలో సంజూ వచ్చారు' అని భారత్ కెప్టెన్ సూర్య చెప్పాడు.

సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. సెమీస్‌ రేసులో వెస్టిండీస్‌ ఒక అడుగు ముందంజలో ఉంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ భారీ తేడాతో విజయం సాధించడమే ఇందుకు కారణం. ఈరోజు దక్షిణాఫ్రికాపై గెలవడంతో విండీస్ రన్ రేట్ పడిపోయింది. జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధిస్తే.. విండీస్ కంటే భారత్ ముందంజలో ఉంటుంది. భారత్ 250 రన్స్ చేసి, జింబాబ్వేను 150కి పరిమితం చేస్తే.. సూర్య సేన రన్ రేట్ భారీగా మెరుగవుతుంది.

తుది జట్లు:

భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

జింబాబ్వే: మరుమాని, బెనెట్, మయర్స్, ర్యాన్‌ బర్ల్, సికందర్‌ రజా (కెప్టెన్), మున్యోంగా, ముసెకివా, ఎవాన్స్, మపోస, ముజరబాని, ఎంగరవ.

Tags:    

Similar News