T20 World Cup Super 8: ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ డూ ఆర్ డై.. పాకిస్తాన్ భవిష్యత్ తేల్చే మ్యాచ్!
T20 World Cup Super 8: కొలంబో వేదికగా టీ20 సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. సెమీస్ బెర్తు కోసం న్యూజిలాండ్ పోరాడుతుండగా, ఇంగ్లాండ్ ఇప్పటికే మెరుగైన స్థితిలో ఉంది.
T20 World Cup Super 8
T20 World Cup Super 8: టీ20 ప్రపంచకప్ లో మరో అతి పెద్ద మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్ల సెమీఫైనల్ అవకాశాల్ని తేల్చేస్తుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ న్యూజిలాండ్ కు డూ ఆర్ డై కాగా.. ఈ మ్యాచ్ ఫలితంపై మరో టీమ్ పాకిస్తాన్ కు కూడా కీలకం కానుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఫలితం పాక్ సెమీస్ అవకాశాల్ని నిర్ణయిస్తుంది. ఈ మ్యాచ్ లో కనుక ఇంగ్లాండ్ గెలిస్తే కివీస్ కి సెమీఫైనల్స్ అవకాశం క్లిష్టం అయిపోతుంది. ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే పాకిస్థాన్ సెమీస్ కి చేరే అవకాశం మూసుకుపోతుంది. దీంతో ఈ మ్యాచ్ పాక్, కివీస్ రెండిటికీ కీలకం కానుంది.
అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుండగా, టాస్ 6:30 గంటలకు ఉంటుంది..
టీ20ల్లో ఇంగ్లాండ్ దే పైచేయి..
T20 World Cup Super 8: ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ఉన్న గణాంకాలను పరిశీలిస్తే, ఇంగ్లాండ్ కొంత ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన 30 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, ఇంగ్లాండ్ 16 విజయాలు సాధించగా, న్యూజిలాండ్ 10 విజయాలతో సరిపెట్టుకుంది. మూడు మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగియగా, ఒకటి టైగా నమోదైంది.
ఐసీసీ ప్రపంచకప్ వేదికగా జరిగిన ఏడు మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ 4, న్యూజిలాండ్ 3 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. గత రికార్డులను చూస్తుంటే, రెండు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. చివరగా 2022 బ్రిస్బేన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హ్యారీ బ్రూక్ సూపర్ ఫామ్..
T20 World Cup Super 8: ప్రస్తుత టోర్నీలో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆరు మ్యాచ్‌లలో 172.64 స్ట్రైక్ రేట్‌తో 202 పరుగులు చేశాడు. అలాగే, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రాణిస్తూ ఆరు మ్యాచ్‌లలో 10 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు 8.73గా ఉంది.
సీఫెర్ట్ కీలకం..
T20 World Cup Super 8: మరోవైపు, న్యూజిలాండ్ జట్టులో టిమ్ సీఫెర్ట్ కీలక బ్యాటర్. అతను ఆరు మ్యాచ్‌లలో 161.6 స్ట్రైక్ రేట్‌తో 181 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగంలో మాట్ హెన్రీ ఆరు వికెట్లతో జట్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
సెమీస్ అవకాశాలను నిర్ణయించే ఈ మ్యాచ్ లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.
పిచ్ - వాతావరణం
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం ఉపరితలం స్పిన్ బౌలింగ్‌కు చాలా అనుకూలంగా ఉండొచ్చు. కొత్త బంతి ప్రారంభంలో చక్కగా వస్తుంది. దాని మెరుపును కోల్పోయిన తర్వాత, మధ్య ఓవర్లలో అది బలంగా తిరుగుతుంది. ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్ మొత్తం 160 పరుగులు విజయానికి సమానం కావచ్చు. ఫిబ్రవరి 27న, కొలంబోలో పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుంది. వర్షం పడే అవకాశం తక్కువ. గరిష్ట ఉష్ణోగ్రత 24 నుండి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా.
రెండు జట్ల ప్లేయింగ్-11
ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (wk), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (c), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (wk), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (c), కోల్ మెక్‌కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.