Sanju Samson: ఛీ కొట్టినోడే చిత్కొకొట్టాడు.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు

Sanju Samson: ఛీ కొట్టినోడే చిత్కొకొట్టాడు.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు

Update: 2026-03-02 04:46 GMT

Sanju Samson

Sanju Samson: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన ‘డూ ఆర్ డై’ పోరులో కేరళ స్టార్ సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సంజూ, భారత్‌ను సగర్వంగా సెమీఫైనల్‌కు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ బ్యాటింగ్ టెక్నిక్ ఒక మాస్టర్ క్లాస్‌ను తలపించింది. సాధారణంగా సంజూ అంటేనే క్లీన్ హిట్టింగ్‌కు మారుపేరు. అయితే ఈ మ్యాచ్‌లో అతను కేవలం భారీ షాట్లకే పరిమితం కాకుండా, పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆటను మలుచుకున్న తీరు అద్భుతం. విండీస్ పేసర్ల వేగాన్ని ఎదుర్కోవడంలో సంజూ చూపిన ఫుట్ వర్క్, బంతి మెరిట్‌ను బట్టి ఆడిన విధానం అతని టెక్నికల్ పరిణతిని చాటిచెప్పింది.ముఖ్యంగా స్పిన్నర్లపై అతను ఆడిన ఇన్‌సైడ్-అవుట్ షాట్లు, లాంగ్-ఆన్ మీదుగా బాదిన సిక్సర్లు ఈడెన్ గార్డెన్స్‌ను హోరెత్తించాయి.వికెట్లు పడుతున్నా పవర్‌ప్లేలో దూకుడు తగ్గించకుండా, కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టును రేసులో నిలిపాడు.

Sanju Samson: సంజూ సాధించిన ఈ 97 పరుగుల ఇన్నింగ్స్ టీమిండియా దిగ్గజాల రికార్డులను తిరగరాసింది.టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ (82*) పేరిట ఉన్న అత్యధిక స్కోరు రికార్డును సంజూ అధిగమించాడు.2024లో రోహిత్ శర్మ చేసిన 92 పరుగుల రికార్డును దాటి, వరల్డ్ కప్‌లో ఒక భారత ఆటగాడు సాధించిన రెండో అత్యధిక స్కోరుగా నిలిచాడు. మొదటి స్థానంలో సురేష్ రైనా 101 ఉన్నాడు.

విజయం అనంతరం సంజూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశాడు. నేను మైదానంలో ఆడిన మ్యాచ్‌ల కంటే, డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చుని రోహిత్, విరాట్, ధోనీల ఆటను గమనించిన మ్యాచ్‌లే ఎక్కువ. క్లిష్ట పరిస్థితుల్లో వారు ఎలా ప్రశాంతంగా ఉంటారో వారిని చూసే నేర్చుకున్నాను అని తెలిపాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం మంచి మనసున్న సంజూ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అని ప్రశంసించడం విశేషం. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సంజూ శాంసన్, ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో తన విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, టీమిండియాకు ప్రపంచకప్ ఆశలను సజీవంగా ఉంచాడు

Tags:    

Similar News