India vs Australia ICC Record Comparison: ఐసీసీ టోర్నీల్లో స్వర్ణయుగం.. అప్పుడు ఆస్ట్రేలియా, ఇప్పుడు భారత్!
India vs Australia ICC Record Comparison: ఐసీసీ టోర్నీల్లో స్వర్ణయుగం అప్పట్లో ఆస్ట్రేలియాది అయితే , ఇప్పుడు అది టీమిండియా వంతు అయింది . ఆ రికార్డులు ఇక్కడ..
India vs Australia ICC Record Comparison
India vs Australia ICC Record Comparison: అంతర్జాతీయ క్రికెట్‌లో విజయాలు సాధించాలంటే జట్టుకు స్థిరత్వం ఎంతో ముఖ్యం. ఐసీసీ టోర్నీల్లో జట్ల ప్రదర్శన స్థిరత్వం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విషయంలో ఆస్ట్రేలియా, భారత్ జట్లు ముందున్నాయి. వేర్వేరు సమయాల్లో ఈ రెండు టీమ్స్ అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలాయి. 2023 నుంచి 2026 మధ్య కాలంలో భారత్ సాధించిన విజయాల పరంపర ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. 2003 నుంచి మే 2007 వరకు ఆస్ట్రేలియా నమోదు చేసిన అద్భుత రికార్డుతో సోషల్ మీడియాలో పోలికలు మొదలయ్యాయి.
2023 నుంచి 2026 వరకు ఐసీసీ టోర్నీల్లో భారత్ మొత్తం 31 మ్యాచ్‌లు ఆడి 29 విజయాలు సాధించింది. కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. ఈ మూడేళ్లలో వరుస విజయాలతో భారత జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో కూడా ఒత్తిడికి లోనవకుండా గెలవడం జట్టు స్థిరత్వాన్ని చూపిస్తుంది. మరోవైపు 2003–2007 మధ్య ఆస్ట్రేలియా అద్భుత ఫామ్‌లో ఉంది. ఆ సమయంలో 30 మ్యాచ్‌లు ఆడి 28 విజయాలు సాధించింది. కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే కంగారూలు ఓటమి చవిచూశారు. ఆ రోజుల్లో ఆసీస్ నాలుగు ఐసీసీ టోర్నీల్లో పాల్గొని.. మూడింటిని గెలవడం వారి స్వర్ణయుగంగా భావిస్తారు.
India vs Australia ICC Record Comparison: టైటిళ్ల పరంగా చూస్తే.. ఆస్ట్రేలియా ఆ కాలంలో మూడు ట్రోఫీలు గెలుచుకోగా, భారత్ ఇప్పటివరకు రెండు ఐసీసీ టైటిళ్లు సాధించింది. 2026 ప్రపంచ కప్ సెమీస్ చేరిన నేపథ్యంలో మూడో ట్రోఫీపై టీమిండియా కన్నేసింది. ఇప్పుడు భారత్ స్వర్ణయుగం నడుస్తుందని చెప్పొచ్చు. గణాంకాల పరంగా చూస్తే.. ఆస్ట్రేలియా, భారత్ జట్లు కూడా తమ తమ కాలంలో అద్భుత ఆధిపత్యం చూపించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. గొప్ప జట్టు అంటే ఒక్క టోర్నీ గెలవడం కాదు, నిరంతర విజయాలతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం కొనసాగించడం. ప్రస్తుతం భారత జట్టు అదే దిశగా ప్రయాణిస్తుండగా.. ఆస్ట్రేలియా గతంలో మాదిరి లేదు. చిన్న జట్లపై ఓడిపోయి మెగా టోర్నీల నుంచి నిష్క్రమిస్తోంది. ప్రస్తుతం భారత్ స్వర్ణయుగం నడుస్తోంది.