Zaheer Khan: మూడు మ్యాచ్‌ల్లో ఆడకుంటే అనుమానిస్తారా?.. తిలక్ టీమిండియా ట్రంప్ కార్డ్!
Zaheer Khan: తిలక్ వర్మ పై జహీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు మ్యాచుల్లో ఆడకపోయినంత మాత్రాన అనుమానిస్తారా ? తిలక్ టీమిండియాకు ట్రంప్ కార్డు అన్నారు
Zaheer Khan
Zaheer Khan: భారత యువ బ్యాటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ప్రతిభపై మాజీ పేసర్ జహీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ భారత జట్టుకు ట్రంప్ కార్డ్ అని పేర్కొన్నాడు. అతడు ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగలడని చెప్పాడు. తిలక్ అద్భుత ఆటగాడని, మూడు మ్యాచ్‌ల్లో ఆడకుంటే అనుమానిస్తారా? అంటూ జహీర్ ఫైర్ అయ్యాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో కొన్ని మ్యాచ్‌ల్లో తిలక్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అభిమానులు, మాజీలు విమర్శలు చేసిన నేపథ్యంలో జహీర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
జహీర్ ఖాన్ మాట్లాడుతూ... 'ఒత్తిడి పరిస్థితుల్లో తిలక్ వర్మ ఆట మరో స్థాయిలో ఉంటుంది. మంచి ఆటగాళ్లు చాలా మందే ఉంటారు. యువ ఆటగాడు అభిషేక్ శర్మ కూడా ప్రతిభావంతుడే. అయితే కీలక మ్యాచ్‌ల్లో తిలక్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కఠిన పరిస్థితులలో క్రీజులో నిలబడి రన్స్ చేస్తాడు. ఏదో రెండు మూడు మ్యాచ్‌లు ఫెయిల్ అయ్యాడని అతడిపై సందేహాలు వ్యక్తం చేస్తారా?. సూపర్-8లో వెస్టిండీస్ జట్టుపై అద్భుతంగా ఆడాడు. అతడిని విమర్శించిన వారు క్షమాపణ చెప్పాలి' అని అన్నాడు.
Zaheer Khan: 'తిలక్ వర్మ కెరీర్ ఇప్పుడే ప్రారంభ దశలో ఉంది. అయినా అతడిలో ఉన్న నైపుణ్యం, ధైర్యం, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడే సామర్థ్యం ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. తిలక్ మంచి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక నుంచి బాగా ఆడుతాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు' అని జహీర్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. తిలక్ వర్మపై జహీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. యువ ఆటగాడిపై ఓ దిగ్గజం చూపిన నమ్మకం అతడి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌లో తిలక్ వర్మ ప్రదర్శన నిరాశాజనకంగానే ఉంది. అమెరికా, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాపై విఫలమయ్యాడు. 25, 25, 25, 31, 1 స్కోర్లు చేశాడు. ఇక్కడ అసలు సమస్య స్ట్రైక్‌రేట్ వద్ద వచ్చింది. చెన్నైలో జింబాబ్వేపై జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో తిలక్ రెచ్చిపోయాడు. 16 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక విండీస్ జట్టుపై 15 బంతుల్లో 27 రన్స్ చేసి.. సంజుపై ఉన్న ఒత్తిడిని తగ్గించాడు. దాంతో తిలక్ మరలా గాడిన పడ్డాడు.