Union Budget 2025 LIVE Updates: జీడీపీ వృద్ధి రేటుపై ఆర్థిక సర్వే నివేదిక అంచనాలు

Union Budget 2025 Live Updates: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి.

Update: 2025-01-31 04:55 GMT

ఈ ఆర్థిక సర్వే రిపోర్టును ఎవరు తయారు చేస్తారు? ఇందులో ఏముంటుంది?

https://www.hmtvlive.com/national/union-budget-2025-live-updates-in-telugu-124399

Union Budget 2025: పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు.

ఆర్థిక సంవత్సరంలో దేశం ఆర్థికంగా సాధించిన ప్రగతికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఆర్థిక సర్వే నివేదిక రూపొందిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం ఏయే రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించింది, ఏయే రంగాల్లో మరింత అభివృద్ధి అవసరం ఉందనే అంశాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నివేదిక ద్వారా వెల్లడించారు. 

Full View


Live Updates
2025-01-31 09:18 GMT

ఇన్సూరెన్స్ సెక్టార్‌లో వృద్ధి నమోదు

ఇండియాలో ఇన్సూరెన్స్ మార్కెట్ గ్రాఫ్ పెరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం 11.2 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే అంతకు ముందు ఏడాదితో పోల్చితే 7.7 % వృద్ధి నమోదైనట్లు ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. 

2025-01-31 09:05 GMT

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 6 నెలల వ్యవధిలోనే పార్లమెంట్‌లో మరోసారి ఎకనమిక్ సర్వే రిపోర్టును ప్రవేశపెట్టారు. చివరిసారిగా గతేడాది లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎకనమిక్ సర్వే రిపోర్టును 2024 జులై 22న సభలో ప్రవేశపెట్టారు. 

2025-01-31 08:52 GMT

ద్రవ్యోల్బణం సంగతేంటి?

రాబోయే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సభకు తెలిపారు. ఆర్థిక సర్వే నివేదికను వివరిస్తూ కేంద్ర మంత్రి ఈ వివరాలను సభకు వెల్లడించారు. 

2025-01-31 08:47 GMT

జీడీపీ వృద్ధి రేటుపై అంచనాలు
వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 లో జీడీపీ వృద్ధి రేటు 6.3 - 6.8 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది.

2025-01-31 08:34 GMT

ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఈ ఎకనమిక్ సర్వే రిపోర్టును తయారు చేసింది.

ఈ ఆర్థిక సర్వే రిపోర్టులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం కేటాయించిన బడ్జెట్, నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన లక్ష్యాలను పొందుపరుస్తారు.

ప్రస్తుతం దేశ ఆర్థికాభివృద్ధి ఎలా ఉంది, దేశం ఎదుర్కుంటున్న ఆర్థిక సవాళ్లు ఏంటనే అంశాలను ప్రస్తావిస్తారు.

అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఏం చేయాలనే లక్ష్యాలను నిర్ధేశించుకోవడానికి ఈ ఆర్థిక సర్వే రిపోర్ట్ ఉపయోగపడుతుంది. 

2025-01-31 08:25 GMT

FM Nirmala Sitharaman tables economic survey report: పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశం ఆర్థికంగా సాధించిన ప్రగతికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఈ ఆర్థిక సర్వే నివేదిక రూపొందిస్తారు.    

2025-01-31 06:08 GMT

భారతీయలు అంతరిక్షంలోకి అడుగుపెట్టే రోజు త్వరలోనే వస్తోంది.

వందో ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

వన్ నేషన్, వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయని ఆమె అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు లబ్ది కలిగిస్తున్నాయి

3 లక్షల మంది మహిళలను లక్ పతి దీదీలుగా మార్చాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించిన రాష్ట్రపతి

సైబర్ క్రైమ్ ను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు

పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసేందుకు కృషి చేస్తాం.

ఈ ప్రాజెక్టుకు రూ. 12 వేల కోట్లు కేటాయించాం.

2025-01-31 05:50 GMT

మూడోసారి ప్రజలు ఎన్డీయేకు పట్టం కట్టారని, ఎన్డీయే 3.Oలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ సెషన్‌లో చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నామన్న మోడీ.. పార్లమెంట్‌ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని కోరారు. ప్రతిపక్షాలు చర్చకు సహకరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌ ప్రజల్లో విశ్వాసం నింపుతుందని, బడ్జెట్‌లో యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. వికసిత్‌ భారత్‌ 2047 సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు మోడీ.

2025-01-31 05:44 GMT

కుంభమేళా తొక్కిసలాటపై చర్చకు విపక్షాల పట్టు

నిరుద్యోగం, రైతు అంశాలపై ప్రస్తావించనున్న కాంగ్రెస్‌

రెండు విడతల్లో జరగనున్న పార్లమెంట్‌ సమావేశాలు

నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత

మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రెండో విడత

2025-01-31 05:44 GMT

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

2024-25 ఆర్థిక సర్వేను సభలో పెట్టనున్న కేంద్రం

రేపు పార్లమెంట్‌ ముందుకు వార్షిక బడ్జెట్‌

బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌

16 బిల్లులు ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం

Tags:    

Similar News