ఈ ఆర్థిక సర్వే రిపోర్టును ఎవరు తయారు చేస్తారు? ఇందులో ఏముంటుంది?

ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం ఈ ఎకనమిక్ సర్వే రిపోర్టును తయారు చేసింది.

ఈ ఆర్థిక సర్వే రిపోర్టులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం కేటాయించిన బడ్జెట్, నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన లక్ష్యాలను పొందుపరుస్తారు.

ప్రస్తుతం దేశ ఆర్థికాభివృద్ధి ఎలా ఉంది, దేశం ఎదుర్కుంటున్న ఆర్థిక సవాళ్లు ఏంటనే అంశాలను ప్రస్తావిస్తారు.

అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఏం చేయాలనే లక్ష్యాలను నిర్ధేశించుకోవడానికి ఈ ఆర్థిక సర్వే రిపోర్ట్ ఉపయోగపడుతుంది. 

Update: 2025-01-31 08:34 GMT

Linked news