అరుణాచల్‌లో ఎగిసిపడుతున్న కార్చిచ్చు: రంగంలోకి వైమానిక దళం.. 9,500 అడుగుల ఎత్తులో సాహసోపేత ఆపరేషన్!
Arunachal Pradesh Forest Fire: అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు అంటుకుంది.
Arunachal Pradesh Forest Fire: అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు అంటుకుంది. అటవిసంపద అగ్నికి ఆహుతైపోతోంది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన భారత వైమానిక దళం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం MI-17V5 హెలికాప్టర్‌లను మోహరించి నీళ్లు గుమ్మరిస్తోంది. అయితే, దాదాపు 9 వేల 500 అడుగుల ఎత్తు నుంచి ఈ ఆపరేషన్ చేయాల్సిరావడం రెస్క్యూ టీమ్స్‌కు మంటలను ఆర్పడం పెను సవాల్‌గా మారింది.
అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత వైమానిక దళం, అటవీశాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. కార్చిచ్చుకిగల కచ్చితమైన కారణాలు ఏవీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ మంటల వల్ల ప్రాణనష్టంగానీ, ఆస్తినష్టంగానీ సంభవించినట్లు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ముందుజాగ్రత్త చర్యగా కార్చిర్చు సంభవించిన ప్రాంతానికి పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. వారికి అవసరమైన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.