Ajit Pawar Plane Crash: విధి ఆడిన వింత నాటకం.. అజిత్ పవార్ విమానం నడపాల్సింది ఆయన కాదు.. పైలట్ సుమిత్ మృతి వెనుక షాకింగ్ నిజాలు!

Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాద ఘటనలో ఒక్కొక్కటిగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

Update: 2026-01-30 06:05 GMT

Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాద ఘటనలో ఒక్కొక్కటిగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంలో మరణించిన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్ అంత్యక్రియలు ఢిల్లీలో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు పంచుకున్న విషయాలు వింటే విధి ఎంత బలీయమైనదో అర్థమవుతుంది.

ట్రాఫిక్ జామ్ మృత్యువుకు దారి తీసింది

నిజానికి అజిత్ పవార్ ప్రయాణించిన 'లియర్ జెట్ 45' విమానాన్ని సుమిత్ కపూర్ నడపాల్సి లేదు. ఆ రోజు కేటాయించిన మరో పైలట్ ముంబైలోని భారీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో, విమానయాన సంస్థ అత్యవసరంగా సుమిత్ కపూర్‌కు పిలుపునిచ్చింది. కొద్దిరోజుల క్రితమే హాంకాంగ్ నుంచి వచ్చిన సుమిత్, సంస్థ ఆదేశాల మేరకు విధుల్లో చేరారు. కేవలం కొన్ని గంటల క్రితం జరిగిన ఈ మార్పు ఆయనను మృత్యువు ఒడికి తీసుకెళ్లింది.

ప్రమాదం జరిగిందిలా.. ముంబై నుంచి బారామతికి బయలుదేరిన ఈ విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో పొగమంచు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంది. రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సుమిత్ కపూర్‌తో పాటు కో-పైలట్ శాంభవి పాఠక్, అసిస్టెంట్ పింకీ మాలి, సెక్యూరిటీ గార్డ్ విదిప్ జాదవ్ మరియు నేత అజిత్ పవార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

అనుభవంపై సందేహాలు వద్దు: వాతావరణ పరిస్థితుల వల్ల పైలట్ అంచనా తప్పి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో వినిపిస్తున్న మాటలను సుమిత్ స్నేహితులు ఖండిస్తున్నారు. వేల గంటల విమానయాన అనుభవం ఉన్న సుమిత్ అంచనా తప్పు అయ్యే అవకాశం లేదని, సాంకేతిక లోపాలపై లోతైన విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో సుమిత్ చేతికున్న బ్రాస్‌లెట్ ఆధారంగానే ఆయనను గుర్తించారు.

పైలట్ల కుటుంబంలో తీరని శోకం: సుమిత్ కపూర్ కుటుంబమంతా పైలట్లే. ఆయన కుమారుడు, అల్లుడు కూడా అదే వృత్తిలో ఉన్నారు. "చనిపోవడానికి కొద్దిసేపటి ముందే తన ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పాడు, ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదు" అని ఆయన సన్నిహితుడు జి.ఎస్. గ్రోవర్ కన్నీటి పర్యంతమయ్యారు.

Tags:    

Similar News