West Bengal Elections 2026: బెంగాల్‌లో ఈసీ సంచలనం.. సీఎస్, హోం సెక్రటరీలపై వేటు!
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
West Bengal Elections 2026: బెంగాల్‌లో ఈసీ సంచలనం.. సీఎస్, హోం సెక్రటరీలపై వేటు!
West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్లో ఉన్న చీఫ్ సెక్రటరీ (CS), హోం సెక్రటరీలను తక్షణమే ఆ పదవుల నుంచి తప్పిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలను స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.
కీలక అధికారుల బదిలీ.. కొత్త బాధ్యతలు వీరికే!
ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రస్తుత సీఎస్ నందిని చక్రవర్తి, హోం సెక్రటరీ జగదీష్ ప్రసాద్ మీనాలను వెంటనే బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. వారి స్థానంలో కొత్త అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది:
కొత్త చీఫ్ సెక్రటరీ: దుష్యంత్ నరియాలా (1993 బ్యాచ్ ఐఏఎస్)
కొత్త హోం సెక్రటరీ: సంఘమిత్ర ఘోష్ (1997 బ్యాచ్ ఐఏఎస్)
సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోపు వీరు బాధ్యతలు స్వీకరించి నివేదిక సమర్పించాలని ఈసీ గడువు విధించింది. బదిలీ అయిన అధికారులకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి ఎన్నికల సంబంధిత విధులు అప్పగించకూడదని కఠిన నిబంధన విధించింది.
రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్న నిర్ణయం
పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. షెడ్యూల్ విడుదలైన వెంటనే మమతా బెనర్జీ ప్రభుత్వంలోని కీలక అధికారులపై ఈసీ వేటు వేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలోనూ బెంగాల్ ఎన్నికల సమయంలో ఈసీ అధికారుల బదిలీలు చేపట్టినప్పటికీ, ఈసారి అత్యంత వేగంగా స్పందించడం గమనార్హం.