పెట్రోల్ బాటిళ్లలో పోస్తున్నారా? బంకులకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. లైసెన్సులు రద్దు!

దేశంలోని పౌరులకు కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏమీ లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేసింది.

Update: 2026-03-14 11:54 GMT

పెట్రోల్ బాటిళ్లలో పోస్తున్నారా? బంకులకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. లైసెన్సులు రద్దు!

దేశంలోని పౌరులకు కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏమీ లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేసింది. అయితే, కొంతమంది భయం కారణంగా ఇంధనాన్ని బాటిళ్లు, డబ్బాలు లేదా ఇతర అశాస్త్రీయ కంటైనర్లలో నింపి ఇళ్లలో నిల్వ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపింది.

ఇలా చేయడంతో తీవ్రమైన అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కేవలం వాహనాల్లోని ట్యాంకర్లకు మాత్రమే ఇంధనాన్ని నింపాలని, విడిగా పోయకూడదని బంక్ నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే...లైసెన్సులు రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Tags:    

Similar News