VK Sasikala: తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. కొత్త పార్టీ పేరు ప్రకటించిన శశికళ..!

VK Sasikala: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

Update: 2026-03-13 09:12 GMT

VK Sasikala: తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. కొత్త పార్టీ పేరు ప్రకటించిన శశికళ..!

VK Sasikala: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే మాజీ నేత, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ (VK Sasikala) సొంత కుంపటి పెట్టారు. శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆమె.. తన కొత్త పార్టీ పేరును ‘ఆల్‌ ఇండియా పురచ్చి తలైవర్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం’ (AIPTMK) గా ప్రకటించారు.

కొబ్బరి చెట్ల గుర్తు.. ఐక్యతకు చిహ్నం:

తమ పార్టీ గుర్తుగా ‘కొబ్బరి చెట్ల సమూహాన్ని’ శశికళ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొబ్బరి చెట్ల సమూహం ఐక్యతకు చిహ్నమని, తమ పార్టీ ఒక ఉమ్మడి కుటుంబంలా పని చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

ఎడప్పాడి పళనిస్వామిపై వెన్నుపోటు ఆరోపణలు:

పార్టీ ప్రకటన సందర్భంగా శశికళ భావోద్వేగానికి లోనయ్యారు. జయలలిత మరణం తర్వాత పార్టీలో అనేక కుట్రలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన వ్యక్తి (ఇపిఎస్) నన్నే వెన్నుపోటు పొడిచారు. తొమ్మిదేళ్లుగా ఓపిక పట్టాను. కానీ ఇకపై మౌనంగా ఉంటే కార్యకర్తలకు, తమిళ ప్రజలకు ద్రోహం చేసినట్లవుతుంది" అని శశికళ పేర్కొన్నారు. అన్నాడీఎంకేను ప్రక్షాళన చేయడమే తన లక్ష్యమని ఆమె పరోక్షంగా సూచించారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే శశికళ ఈ నిర్ణయం తీసుకోవడం అన్నాడీఎంకే మరియు ఇతర ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతోంది.

Tags:    

Similar News