Bank Holidays: బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?
Bank Holidays: సాధారణంగా ఫిబ్రవరి అంటేనే చిన్న నెల. కానీ, ఈసారి సెలవుల సందడి ఎక్కువే ఉంది. ఫిబ్రవరి నెల వచ్చేసింది..
Bank Holidays: బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?
సాధారణంగా ఫిబ్రవరి అంటేనే చిన్న నెల. కానీ, ఈసారి సెలవుల సందడి ఎక్కువే ఉంది. ఫిబ్రవరి నెల వచ్చేసింది.. క్యాలెండర్ తిరగేయగానే తక్కువ రోజులే కనిపిస్తాయి కానీ, ఈ నెలలో బ్యాంక్ పనుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే, ఈ 28 రోజుల్లోనే దాదాపు 9 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆదివారాలు, శనివారాలతో పాటు ప్రాంతీయ పండుగలు కూడా తోడవడంతో బ్యాంక్ కస్టమర్లు తమ పనులను ముందే చక్కబెట్టుకోవడం మంచిది.
వీకెండ్ హాలిడేస్
వారంతపు సెలవుల కారణంగా ఫిబ్రవరిలో ఆరు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
ఫిబ్రవరి 1: ఆదివారం (నెల మొదటి రోజే సెలవుతో బోణీ కొట్టింది)
ఫిబ్రవరి 8: ఆదివారం
ఫిబ్రవరి 14: రెండో శనివారం
ఫిబ్రవరి 15: ఆదివారం
ఫిబ్రవరి 22: ఆదివారం
ఫిబ్రవరి 28: నాలుగో శనివారం
ప్రాంతీయ పండుగలు
కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక దినోత్సవాల వల్ల అదనపు సెలవులు ఉన్నాయి. మీరు ఆయా రాష్ట్రాల్లో ఉండేవారైతే ఇవి గమనించండి:
ఫిబ్రవరి 18 (బుధవారం): 'లోసర్' పండుగ సందర్భంగా సిక్కిం (గాంగ్‌టక్) లో బ్యాంకులు పనిచేయవు.
ఫిబ్రవరి 19 (గురువారం): ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. మహారాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 20 (శుక్రవారం): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరం (ఐజ్వాల్), మణిపూర్ (ఇంఫాల్) లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
కస్టమర్లు ఏం చేయాలి?
బ్యాంకుకు వెళ్లే పని ఉంటే చివరి నిమిషం వరకు ఆగకండి. ముఖ్యంగా ఈ మూడు విషయాల్లో జాగ్రత్త అవసరం. మీరు ఎవరికైనా చెక్కు ఇచ్చినా లేదా మీకు వచ్చినా, క్లియరెన్స్‌కు సమయం పడుతుంది. సెలవుల వల్ల ఆలస్యం కాకుండా రెండు రోజుల ముందే డిపాజిట్ చేయండి. లోన్ అప్రూవల్స్ లేదా ఇతర పత్రాలపై సంతకాల కోసం బ్యాంక్ మేనేజర్‌ను కలవాలంటే వర్కింగ్ డేస్‌లోనే ప్లాన్ చేసుకోండి.
బ్యాంక్ షట్టర్ క్లోజ్ ఉన్నా, మీ అరచేతిలో బ్యాంకింగ్ ఉంటుంది. Net Banking, Mobile Banking, UPI సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. అత్యవసర నగదు కోసం ATMలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ముందుగా ప్లాన్ చేసుకుంటే ముప్పు ఉండదు. ఈ సెలవుల జాబితాను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉంటారు.