PAN Card: బిగ్ అలర్ట్.. మార్చి 31 తర్వాత మారనున్న పాన్ కార్డ్ రూల్స్.. అవేంటంటే?

PAN Card Documents Required: పాన్ కార్డు తీసుకోవాలనుకునే వారికి ముఖ్య హెచ్చరిక! మార్చి 31 తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Update: 2026-03-18 07:37 GMT

PAN Card: బిగ్ అలర్ట్.. మార్చి 31 తర్వాత మారనున్న పాన్ కార్డ్ రూల్స్.. అవేంటంటే?

PAN Card New Rules 2026: ప్రస్తుతం మన దేశంలో కొత్త పాన్ కార్డ్ తీసుకోవాలంటే కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్‌లోని వివరాల ఆధారంగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ ద్వారా నిమిషాల్లో పాన్ కార్డ్ జారీ అవుతోంది. అయితే, ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ విధానం మారబోతోంది. సీఎస్‌సీ గవర్నెన్స్ (CSCeGov) సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం, పాత దరఖాస్తు ఫారమ్‌లు ఏప్రిల్ నుంచి చెల్లుబాటు కావు.

ఏప్రిల్ 1 నుంచి అవసరమయ్యే అదనపు పత్రాలు..

ఇకపై ఆధార్ కార్డుతో పాటు, మీ పుట్టిన తేదీని (Date of Birth) ధృవీకరించే మరో అదనపు డాక్యుమెంట్‌ను సమర్పించడం తప్పనిసరి. ఇంకా ఏయే పత్రాలు అందించాలో ఓసారి చూద్దాం..

పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Birth Certificate)

ఓటరు గుర్తింపు కార్డు (Voter ID)

పదవ తరగతి మార్కుల జాబితా (10th Marksheet)

డ్రైవింగ్ లైసెన్స్ (Driving License)

పాస్‌పోర్ట్ (Passport)

మెజిస్ట్రేట్ ధృవీకరించిన అఫిడవిట్

మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకోవడం వల్ల లాభం ఏమిటి?

మీరు ఇంకా పాన్ కార్డ్ తీసుకోకపోయినా లేదా మీ కుటుంబ సభ్యులకు అవసరమైనా, మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఈ గడువులోపు దరఖాస్తు చేస్తే, మీకు ఎటువంటి అదనపు పత్రాల అవసరం లేకుండా కేవలం ఆధార్ ఓటీపీ (OTP) ద్వారా సులభంగా పాన్ కార్డ్ వచ్చేస్తుంది.

ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ దరఖాస్తు చేసుకునే విధానం (Step-by-Step)

మీరు ఇంట్లోనే ఉండి సులభంగా పాన్ కార్డ్ కోసం ఇలా అప్లై చేయవచ్చు:

అధికారిక వెబ్‌సైట్: ముందుగా NSDL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

అప్లికేషన్ టైప్: 'Apply Online' ట్యాబ్‌లో 'New PAN - Indian Citizen (Form 49A)' ఎంచుకుని, కేటగిరీలో 'Individual' సెలెక్ట్ చేయండి.

వివరాల నమోదు: మీ పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకు ఒక టోకెన్ నంబర్ వస్తుంది. దానిని నోట్ చేసుకోండి.

ఆధార్ వెరిఫికేషన్: ఆధార్ కార్డు ద్వారా e-KYC ఆప్షన్ ఎంచుకుంటే, మీ ఫోటో, సంతకం విడిగా అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఫీజు చెల్లింపు: నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించండి.

చివరి దశ: మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటిపిని ఎంటర్ చేస్తే మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

స్థానిక ప్రజలకు సూచనలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా మంది ఇప్పటికీ పాక్ కార్డు లేకుండా ఉన్నారు. కొత్త నిబంధనల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా దగ్గరలోని మీ సేవ కేంద్రాల్లో వెంటనే అప్లై చేయడం మంచిది.

Tags:    

Similar News