మిరాకిల్ అంటే ఇదే.. బావిలో పడ్డ చిన్నారి ప్రాణాలు కాపాడిన డ్రెస్సు
Karnataka: కర్ణాటక రాష్ట్రంలోని సిర్సిలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. మృత్యువు అంచుల్లోకి వెళ్లిన రెండేళ్ల చిన్నారిని అదృష్టం వరించి ప్రాణాలతో తిరిగి వచ్చింది.
మిరాకిల్ అంటే ఇదే.. బావిలో పడ్డ చిన్నారి ప్రాణాలు కాపాడిన డ్రెస్సు
Karnataka: కర్ణాటక రాష్ట్రంలోని సిర్సిలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. మృత్యువు అంచుల్లోకి వెళ్లిన రెండేళ్ల చిన్నారిని అదృష్టం వరించి ప్రాణాలతో తిరిగి వచ్చింది. 50 అడుగుల లోతైన బావిలో పడిపోయినా, ఆ చిన్నారి వేసుకున్న దుస్తులు మోటారు పైపుకు చిక్కుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
అసలేం జరిగిందంటే?
భువి అనే రెండేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న 50 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుగా చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో బావిలో నుంచి ఏడుపు వినబడటంతో వెంటనే అక్కడికి వెళ్లి చూశారు.
పైపుకు వేలాడుతూ..
బావిలోకి చూడగా ఆ చిన్నారి నీటిలో మునిగిపోకుండా, మధ్యలోనే బావిలోని మోటారు పైపుకు తన దుస్తులు ఇరుక్కోవడంతో వేలాడుతూ కనిపించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. సమయం వృధా చేయకుండా ఒక స్థానికుడు తాడు సాయంతో బావిలోకి దిగి, సుమారు అరగంట పాటు శ్రమించి చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
చిన్నారి క్షేమంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. "దేవుడే నా బిడ్డను కాపాడాడు" అంటూ ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.