ఈ సెషన్‌లో చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నాం: మోడీ

మూడోసారి ప్రజలు ఎన్డీయేకు పట్టం కట్టారని, ఎన్డీయే 3.Oలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ సెషన్‌లో చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నామన్న మోడీ.. పార్లమెంట్‌ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని కోరారు. ప్రతిపక్షాలు చర్చకు సహకరిస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌ ప్రజల్లో విశ్వాసం నింపుతుందని, బడ్జెట్‌లో యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. వికసిత్‌ భారత్‌ 2047 సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు మోడీ.

Update: 2025-01-31 05:50 GMT

Linked news