Union Budget 2025 Live Updates: రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండబోదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Union Budget 2025 Live Updates: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ సారి.

Update: 2025-02-01 00:30 GMT

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025 ప్రసంగం

Budget 2025 Income Tax Expectations Live: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ సారి. మొరార్జీ దేశాయ్, పి చిదంబరం తరువాత అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిగా ఆమె తన పేరు సుస్థిరం చేసుకున్నారు. అయితే, ఈ కేంద్ర బడ్జెట్‌పై దేశ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

అధికారంలో ఎవరు ఉన్నారు అనే విషయంతో సంబంధం లేకుండా బడ్జెట్ వస్తోందంటే చాలు... ప్రతీసారి కార్పొరేట్ వర్గాల నుండి కామన్ మ్యాన్ వరకు అందరి ఆశ ఒక్కటే ఉంటుంది. ఈసారి బడ్జెట్‌లో తమకు ఎలాంటి మేలు కలుగుతుందా అని కార్పొరేట్ వర్గాలు, ఈసారైనా బడ్జెట్ తమకేమైనా పనికొస్తుందా అని జనం ఎదురుచూస్తునే ఉంటారు.

ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచితేనే తమ జేబుకు పన్ను రూపంలో చిల్లు పడకుండా ఉంటుందని సామాన్యులు ఆశపడుతున్నారు. అంతేకాకుండా తమ రోజువారీ జీవితంలో పనికొచ్చే అనేక రకాల ఉత్పత్తులు, సేవలపై పన్ను భారం తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. వివిధ రంగాల్లో ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీలు పెంచాలని ఆశిస్తున్నారు. మరి సామాన్యులు కోరికలను ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా ? ఈ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనే పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తూ మీ కోసమే ఈ బడ్జెట్ న్యూస్ లైవ్ అప్‌డేట్స్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం దయచేసి పేజ్ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. 

Live Updates
2025-02-01 09:37 GMT

మొబైల్ ఫోన్లు, క్యాన్సర్ సహా ఇతర కీలక ఔషధాలు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల ధరలు భారీగా తగ్గనున్నాయి. మరో వైపు అల్లిన దుస్తుల ధరలు పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ 2025-26 ను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ అనంతరం ఏయే వస్తు సేవలకు ధరలు పెరగనున్నాయి, ఏయే వాటికి తగ్గనున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

2025-02-01 09:35 GMT

ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను వసూలు వర్తించదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయమై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మధ్య తరగతి ప్రజలకు ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎంతో లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. ప్రధాని మోదీ ఇంకా ఏమన్నారంటే...


2025-02-01 08:59 GMT

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం రూ.30, 436. 95 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2025-26 బడ్జెట్ ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ రూ. 12, 157. 53 కోట్లుగా కేంద్రం తెలిపింది. 2025-26 బడ్జెట్ లో రూ. 12,157.53 కోట్లను కేంద్రం కేటాయించింది.  మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

2025-02-01 08:53 GMT

బడ్జెట్ 2025 పై శశి థరూర్ తనదైన స్టైల్లో స్పందించారు. "ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పగానే బీజేపి ఎంపీలు అందరూ బల్లలు చరుస్తూ సంతృప్తిని వ్యక్తంచేశారు. నిజం చెప్పాలంటే దాని వల్ల మధ్య తరగతి వేతన జీవులకు ఏదైనా మేలు కలుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపి ఎంపీలు అలా బల్లలు చరుస్తూ బడ్జెట్ కు తమ మద్దతు తెలిపారు. కానీ అసలు జనానికి ఆదాయం రావాలన్నా, పోవాలన్నా ఉద్యోగం ఉంటేనే కదా" అని శశి థరూర్ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగ సమస్య గురించి కేంద్ర మంత్రి అసలు ఏమీ చెప్పనే లేదని థరూర్ అన్నారు. ఉద్యోగాలే లేనప్పుడు ఆదాయ పన్ను మినహాయింపు ఎక్కడినుండి వచ్చిందని శశి థరూర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. 


2025-02-01 08:42 GMT

రూ 12 లక్షల వరకు నో ఇన్‌కమ్ ట్యాక్స్ అంటూనే మరో మెలిక పెట్టారు. అంతా మాయ చేస్తున్నారు. ఈ బడ్జెట్ ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో ఓటర్లను ఊరించడం కోసం చేసిన మాయగానే ఉంది - డిఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్


2025-02-01 08:31 GMT

రక్షణ శాఖ రూ. 4,91,732 కోట్లు

గ్రామీణాభివృద్ధి శాఖ - 2,66,817 కోట్లు

హోంశాఖ కోసం రూ. 2,33,211 కోట్లు

వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల కోసం రూ. 1,71,437

విద్యా శాఖ కోసం రూ. 1,28,650 కోట్లు

ఆరోగ్య శాఖ రూ. 98,311 కోట్లు

పట్టణాభివృద్ధి శాఖ కోసం రూ. 96,711 కోట్లు

ఐటితో పాటు టెలికాం రంగం అభివృద్ధి కోసం రూ. 95,298 కోట్లు

విద్యుత్ శక్తి రూ. 81,174 కోట్లు

వాణిజ్యంతో పాటు పరిశ్రమల శాఖ అభివృద్ధి కోసం రూ. 65,553 కోట్లు

సామాజిక సంక్షేమం కోసం రూ. 60,052 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

2025-02-01 08:10 GMT

రాబోయే మూడేళ్లలో అన్ని జిల్లా ఆస్పత్రులలో డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ముందుగా ఈ 2025 - 26 ఆర్థిక సంవత్సరంలో 200 జిల్లాల్లో క్యాన్సర్ పేషెంట్స్ కోసం డే కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించింది. 

2025-02-01 07:26 GMT

హీల్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇంతకీ హీల్ ఇన్ ఇండియా అంటే ఏంటంటే... క్లిష్టమైన జబ్బులకు వైద్యం, ఇతర అనారోగ్య సమస్యల చికిత్సల కోసం విదేశీయులు భారత్‌కు వచ్చి వైద్యం చేయించుకునే దిశగా వారిని ప్రోత్సహించడం అన్నమాట. దీనినే సాంకేతిక పరిభాషలో మెడికల్ వ్యాల్యూ ట్రావెల్ ( Medical Value Travel ) అని కూడా అంటుంటారు. 

2025-02-01 07:15 GMT

Personal income tax reforms to focus on middle class

మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలపై దృష్టి సారిస్తూ పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో సంస్కరణలు తీసుకురానున్నట్లు కేంద్రం అభిప్రాయపడింది.

2025-02-01 07:12 GMT

సీనియర్ సిటిజెన్స్‌కు ఇప్పటివరకు ఉన్న రూ. 50 వేల ట్యాక్స్ డిడక్షన్ పరిమితిని రెండింతలు చేస్తూ రూ. 1 లక్షకు పెంచిన కేంద్రం.

Tags:    

Similar News