Union Budget 2025 Live Updates: రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండబోదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Update: 2025-02-01 00:30 GMT
Live Updates - Page 2
2025-02-01 07:10 GMT

స్టార్టప్ సంస్థలకు 5 ఏళ్ల పాటు ప్రోత్సాహకాల కొనసాగింపు

స్టార్టప్ సంస్థలు ఏర్పడినప్పటి నుండి వరుసగా 5 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 

2025-02-01 06:57 GMT

New tax regime కొత్త ట్యాక్స్ పాలసీ ప్రకారం:

రూ. 4 లక్షల ఆదాయంపై ఎలాంటి పన్ను వసూలు చేయరు.

రూ. 4-8 లక్షల ఆదాయంపై - 5% పన్ను వసూలు చేస్తారు.

రూ. 8-12 లక్షల ఆదాయంపై - 10% పన్ను వసూలు చేస్తారు.

రూ. 12-16 లక్షల ఆదాయంపై - 15% పన్ను వసూలు చేస్తారు.

రూ. 16-20 లక్షల ఆదాయంపై - 20% పన్ను వసూలు చేస్తారు.

రూ. 20-25 లక్షల ఆదాయంపై - 25% పన్ను వసూలు చేస్తారు.

రూ. 25 లక్షల ఆదాయంపై - 30% పన్ను వసూలు చేస్తారు.

2025-02-01 06:46 GMT

No income tax up to Rs12 lakhs - Nirmala Sitharaman in her Budget speech                

రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండబోదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్


2025-02-01 06:43 GMT

అద్దె రూపంలో వచ్చే ఆదాయంపై ఇప్పటి వరకు ఉన్న రూ. 2.4 లక్షల టీడీఎస్ పరిమితిని రూ. 6 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం

2025-02-01 06:40 GMT

లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం

Cancer, chronic diseases - 36 life-saving drugs exempted from basic customs duty

క్యాన్సర్‌తో పాటు ఇతర ప్రాణాంతక జబ్బుల చికిత్సలో ప్రాణాలు రక్షించే 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుండి మినహాయిస్తున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది. దీంతో ఆయా జబ్బులకు చికిత్స తీసుకుంటున్న వారికి అవసరమయ్యే మందుల కొనుగోలు భారం కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది.

అయితే 6 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై మాత్రం 5 శాతం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2025-02-01 06:34 GMT

ఇన్సూరెన్స్ సెక్టార్‌లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది. (100% FDIs in insurance sector ) . 

2025-02-01 06:29 GMT

రాబోయే 10 ఏళ్లలో 100 కుపైగా రీజినల్ ఎయిర్ పోర్టుల నిర్మాణం.

2025-02-01 06:28 GMT

యుద్ధ ప్రాతిపదికన 1 లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం కోసం 15000 కోట్ల నిధుల కేటాయింపు. 

2025-02-01 06:26 GMT

మెడికల్ కాలేజీల్లో 10,000 సీట్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం. 

Tags:    

Similar News