Union Budget 2025 Live Updates: రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండబోదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
2028 వరకు జల్ జీవన్ మిషన్ కొనసాగించనున్నట్లు స్పష్టంచేసిన కేంద్రం.
ఐఐటిల్లో మరింత మంది విద్యార్థులకు అడ్మిషన్స్ కల్పించేలా మౌళిక వసతుల కల్పన కోసం కృషి చేయనున్నట్లు ప్రకటించిన కేంద్రం. ఐఐటి పట్నాను విస్తరించనున్నట్లు ప్రకటన.
Union Budget 2025: సెంట్రల్ బడ్జెట్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏం కోరుకుంటున్నాయి?
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రాజెక్టులు, పథకాలకు నిధులు కేటాయించాలని తెలుగు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ లో నిధుల కోసం ఏపీ ప్రభుత్వం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. నిర్మలమ్మ బడ్జెట్‌లో తమకు ఎన్ని వందల కోట్లు కేటాయిస్తారని రెండు తెలుగు రాష్ట్రాలు ఆశగా చూస్తున్నాయి. Union Budget 2025: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోర్కెల చిట్టా పూర్తి కథనం.
ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళల సాధికారత కోసం రూ. 2 కోట్ల టర్మ్ లోన్స్
ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళల సాధికారత కోసం నడుం బిగించినట్లు కేంద్రం ప్రకటించింది. అందులో భాగంగానే మొదటిసారి వ్యాపారరంగంలోకి అడుగుపెట్టే మహిళా ఎంటర్‌ప్రెన్యువర్స్‌కు రూ. 2 కోట్ల వరకు టర్మ్ లోన్స్ అందించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
నూనె గింజల ఉత్పత్తి పెంపుపై ప్రత్యేక దృష్టి
నూనె గింజల ఉత్పత్తిలో సామర్ధ్యం పెంచడం కోసం 6 ఏళ్ల పాటు ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కింద కృషి చేయనున్నట్లు ప్రకటించిన కేంద్రం.
KISAN Credit card loan limit: కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ లిమిట్ పెంపు
రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు మీద ఇచ్చే రుణాలను రూ. 3 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
పత్తి రైతులకు మేలు చేసేందుకు జాతీయ పత్తి మిషన్ ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ మిషన్ పనిచేయనుంది. కూరగాయలు, పండ్ల లభ్యత పెంచేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Agriculture budget 2025: PM Dhandhanya Krishi Yojna Scheme- వ్యవసాయం అభివృద్ధి కోసం పీఎం ధన్‌ధాన్య క్రిషి యోజన పథకం
దేశంలో వ్యవసాయంలో ఉత్పత్తి పరంగా వెనుకబడిన 100 జిల్లాలను ఎంపిక చేసుకుని అక్కడ పీఎం ధన్‌ధాన్య క్రిషి యోజన పథకం ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం ద్వారా 1 కోటి 70 లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
కేంద్ర బడ్జెట్‌పై నిరసన వ్యక్తంచేస్తూ విపక్ష సభ్యులు పార్లమెంట్ సభ నుండి వాకౌట్ చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ కొనసాగిస్తున్నారు.
FM Nirmala Sitharaman tables Union Budget 2025 amid protests:
విపక్షాల నిరసనల మధ్యే బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రసంగం ప్రారంభించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
#BudgetWithDDNews | Unlock the ultimate Budget Day experience with DD News!
— DD News (@DDNewslive) February 1, 2025
Join us as we decode Budget 2025 with expert insights and real-time updates!#Budget2025 #UnionBudget2025 #BudgetForViksitBharat@FinMinIndia @nsitharaman @nsitharamanoffc https://t.co/fPvzd2AwEp
Union Budget 2025: నిర్మలా సీతారామన్ మధ్యతరగతిపై పన్నుల భారం తగ్గిస్తారా?
Union Budget 2025 Expectations: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెడుతున్న ఎనిమిదో బడ్జెట్. గతంలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తొమ్మది సార్లు పార్లమెంటులో బడ్జెట్ సమర్పించారు. ఎనిమిది బడ్జెట్ ప్రజెంటేషన్స్‌తో ప్రణబ్ ముఖర్జీ ఆ తరువాత స్థానంలో ఉన్నారు.
అయితే, వీరెవరూ కూడా ఆ బడ్జెట్స్ వరసగా సమర్పించలేదు. మధ్యలో బ్రేక్స్ వచ్చాయి. కానీ, నిర్మలా సీతారామన్ నిరంతరాయంగా ఇప్పటికి 7 బడ్జెట్స్ ప్రవేశపెట్టి, ఎనిమిదో బడ్జెట్‌తో ప్రణబ్ దా రికార్డును ఈక్వల్ చేయబోతున్నారు. మోదీ మూడో విడత పాలనలో ఇది రెండో బడ్జెట్టే కాబట్టి... ఆమె ఈ విషయంలో అందరి రికార్డులను బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది.
సరే.. ఈ రికార్డుల సంగతి పక్కన పెడితే, ఈసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఏముంటుంది? ఇదే ఇప్పుడు 50 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రశ్న. మోదీ 3.0 శకం మొదలైన తరువాత జూన్ నెలలో సమర్పించిన బడ్జెట్ అంచనాలు 48 లక్షల కోట్లకు పైమాటే. ఈసారి ఈ మొత్తం మరింత పెరుగుతుంది. అందులో డౌట్ లేదు. ముఖ్యంగా, ఈ బడ్జెట్‌లో ఏముంటుందన్న ప్రశ్న కార్పొరేట్లనే కాదు, ఇప్పుడు మధ్య తరగతి ప్రజలతో పాటు పేదలనూ వేధిస్తోంది. ఈ ఆశల బడ్జెట్‌పై పూర్తి విశ్లేషణాత్మక కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.