Union Budget 2025 Live Updates: రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండబోదన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి
రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారమన్
బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలిసిన ఆర్థికమంత్రి
కేంద్ర బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్
మరికొద్ది గంటల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రజలు కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు. అందునా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశలన్నీ కేంద్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది కాబట్టి ప్రజలు, నాయకుల అంచనాలు కూడా రెట్టింపయ్యాయి.
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం గంపెడు ఆశలు
నిర్మలమ్మ బడ్జెట్.. తెలంగాణ సర్కార్‌కు భారీ ఆశలు రేపుతోంది. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి ప్రాజెక్టుల నిధుల కోసం కేంద్రం నుంచి సాయం కోసం ఎదురుచూస్తోంది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి కోటీ 63 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరుతోంది. మరికొద్ది గంటల్లో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్... తెలంగాణకు ఏవిధంగా న్యాయం చేయగలదో చూడాలి.
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం
పార్లమెంట్‌లోనే భేటీకానున్న కేబినెట్
బడ్జెట్‌ను ఆమోదించనున్న కేబినెట్
కాసేపట్లో పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ 2025-26
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్
ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
2025 కేంద్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
కేంద్ర బడ్జెట్‌పై పేదలు, మధ్య తరగతి, వేతన జీవుల ఆశలు
పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్..
పథకాల కొనసాగింపు.. కొత్త పథకాలపై ఆసక్తి
వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులపై ఉత్కంఠ
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.5 లక్షలకు పెంచే అవకాశం
విత్తనాలు, ఎరువులపై GST తగ్గించే ఛాన్స్
పన్ను మినహాయింపు పరిధి రూ.75 వేల వరకు పెంచే ఛాన్స్
జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజనకు కేటాయింపులు పెరుగుతాయా..?
మోడీ మార్క్ పథకాలకు మరిన్ని తోడయ్యేనా..?