Union Budget 2025: కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు

Union Budget 2025 Hikes Kisan Credit Card Limit From Rs 3 Lakh To Rs 5 Lakh
x

Union Budget 2025: కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంపు

Highlights

Kisan Credit Card: పత్తి రైతులకు మేలు చేసేందుకు జాతీయ పత్తి మిషన్ ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Kisan Credit Card: పత్తి రైతులకు మేలు చేసేందుకు జాతీయ పత్తి మిషన్ ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025-25 బడ్జెట్ లో వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది.

పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ మిషన్ పనిచేయనుంది. కూరగాయలు, పండ్ల లభ్యత పెంచేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మరోవైపు యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ది కోసం దేశంలో కొత్త యూరియా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

వరితో పాటు ఇతర పంటలు అధిక ఉత్పత్తి కోసం ప్రత్యేక జాతీయ మిషన్ ను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

గోదాములు, నీటి పారుదల, రుణ సౌకర్యాల కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలోని 1.7 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల రైతులకు ప్రయోజనం కలుగుతోందని కేంద్రం భావిస్తోంది.

రైతుల నుంచి కంది, మినుములు, మసూరు ను కొనుగోలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. పప్పు ధాన్యాల స్వయం సమృద్దికి 6 ఏళ్ల వ్యవధితో ప్రత్యేక మిషన్ ను ఏర్పాటు చేయనుంది కేంద్రం. 7.74 కోట్ల రైతులకు స్వల్పకాలిక రుణాల కోసం క్రెడిట్ కార్డులను మంజూరు చేయనున్నారు. దీనికి తోడు రైతుల రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories