Union Budget 2025: నిర్మలా సీతారామన్ మధ్యతరగతిపై పన్నుల భారం తగ్గిస్తారా?

Union Budget 2025 Expectations: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెడుతున్న ఎనిమిదో బడ్జెట్. గతంలో భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం తొమ్మది సార్లు పార్లమెంటులో బడ్జెట్ సమర్పించారు. ఎనిమిది బడ్జెట్ ప్రజెంటేషన్స్‌తో ప్రణబ్ ముఖర్జీ ఆ తరువాత స్థానంలో ఉన్నారు.

అయితే, వీరెవరూ కూడా ఆ బడ్జెట్స్ వరసగా సమర్పించలేదు. మధ్యలో బ్రేక్స్ వచ్చాయి. కానీ, నిర్మలా సీతారామన్ నిరంతరాయంగా ఇప్పటికి 7 బడ్జెట్స్ ప్రవేశపెట్టి, ఎనిమిదో బడ్జెట్‌తో ప్రణబ్ దా రికార్డును ఈక్వల్ చేయబోతున్నారు. మోదీ మూడో విడత పాలనలో ఇది రెండో బడ్జెట్టే కాబట్టి... ఆమె ఈ విషయంలో అందరి రికార్డులను బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది.

సరే.. ఈ రికార్డుల సంగతి పక్కన పెడితే, ఈసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఏముంటుంది? ఇదే ఇప్పుడు 50 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రశ్న. మోదీ 3.0 శకం మొదలైన తరువాత జూన్ నెలలో సమర్పించిన బడ్జెట్ అంచనాలు 48 లక్షల కోట్లకు పైమాటే. ఈసారి ఈ మొత్తం మరింత పెరుగుతుంది. అందులో డౌట్ లేదు. ముఖ్యంగా, ఈ బడ్జెట్‌లో ఏముంటుందన్న ప్రశ్న కార్పొరేట్లనే కాదు, ఇప్పుడు మధ్య తరగతి ప్రజలతో పాటు పేదలనూ వేధిస్తోంది. ఈ ఆశల బడ్జెట్‌పై పూర్తి విశ్లేషణాత్మక కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Update: 2025-02-01 05:36 GMT

Linked news