'Heal in India' campaign - భారత్‌లో వైద్యం కోసం విదేశీయులను రప్పించేందుకు హీల్ ఇన్ ఇండియా క్యాంపెయిన్
హీల్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇంతకీ హీల్ ఇన్ ఇండియా అంటే ఏంటంటే... క్లిష్టమైన జబ్బులకు వైద్యం, ఇతర అనారోగ్య సమస్యల చికిత్సల కోసం విదేశీయులు భారత్‌కు వచ్చి వైద్యం చేయించుకునే దిశగా వారిని ప్రోత్సహించడం అన్నమాట. దీనినే సాంకేతిక పరిభాషలో మెడికల్ వ్యాల్యూ ట్రావెల్ ( Medical Value Travel ) అని కూడా అంటుంటారు.
Update: 2025-02-01 07:26 GMT