అసలు ఉద్యోగాలే లేకపోతే ఇంక ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది - శశి థరూర్
బడ్జెట్ 2025 పై శశి థరూర్ తనదైన స్టైల్లో స్పందించారు. "ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పగానే బీజేపి ఎంపీలు అందరూ బల్లలు చరుస్తూ సంతృప్తిని వ్యక్తంచేశారు. నిజం చెప్పాలంటే దాని వల్ల మధ్య తరగతి వేతన జీవులకు ఏదైనా మేలు కలుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపి ఎంపీలు అలా బల్లలు చరుస్తూ బడ్జెట్ కు తమ మద్దతు తెలిపారు. కానీ అసలు జనానికి ఆదాయం రావాలన్నా, పోవాలన్నా ఉద్యోగం ఉంటేనే కదా" అని శశి థరూర్ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగ సమస్య గురించి కేంద్ర మంత్రి అసలు ఏమీ చెప్పనే లేదని థరూర్ అన్నారు. ఉద్యోగాలే లేనప్పుడు ఆదాయ పన్ను మినహాయింపు ఎక్కడినుండి వచ్చిందని శశి థరూర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
Update: 2025-02-01 08:53 GMT