Guntur District Updates: అమరావతి అమరేశ్వరాలయంలో కార్తీకమాస ప్రారంభ పూజలు...
గుంటూరు ....
* కార్తీకసోమవారం కావడంతో స్వామికివారికి ప్రత్యేక అభిషేకాలు..
* కరోనా నేపధ్యంలో తగ్గిన భక్తుల రద్ధీ....
* కిృష్ణాపుష్కరిణిలో భక్తుల పుణ్యస్నానాలు నిలిపివేసిన అధికారులు...
* మాస్కులతో ధీపారాధనలు చేస్తున్న భక్తులు....
* మాస్కులు,సామాజికదూరంతో స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు...
Visakha Updates: యారడాలో తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం...
విశాఖ
-యారడా తీరంలో చిక్కుకున్న ముగ్గురు యువకులు
-ఆదివారం ఆటవిడుపుగా యారడాకు వచ్చిన ఏడుగురు యువకులు
-అలల తాకిడికి తీరంలోని పిట్ల కొండ వద్ద రాళ్ళల్లో చిక్కుకున్న యువకులు
-నగరానికి చెందిన కొండ నవీన్(20)
-భీశెట్టి యశ్వంత్(20) కె.శ్రవణ్(20)
-మిగిలిన మిత్రుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న న్యూ పోర్ట్ పోలీసులు
-పోలీసుల ఫిర్యాదుతో రంగంలోకి రెవెన్యూ,రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్ళు
-యువకులను రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేసిన అధికార యంత్రాంగం
-ఎట్టకేలకు అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో యువకులను రక్షించిన గజ ఈతగాళ్ళు
-ప్రాణాలతో తీరానికి యువకులు ఊపిరి పీల్చుకున్న అధికారులు
East Godavari Updates: పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన కార్తికపూజలు..
తూర్పు గోదావరి జిల్లా...
- కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని పిఠాపురం ప్రముఖ పాదగయ పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన కార్తికపూజలు..
- కోవిడ్ నిబంధనలు అనుసరించి భక్తులకు ప్రత్యక ఏర్పాట్లు...
- పాదగయ పుష్కరిణిలో స్నానాలకు అనుమతి నిరాకరణ..
- కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకాలు మరియు అమ్మవార్లకు ప్రత్యేక పూజలకు,దర్శనాలకు మాత్రమే అనుమతి..
- సామాజిక దూరంతో దర్శించుకుంటున్న భక్తులు..
- భక్తులు అంతంతమాత్రంగా రావడంతో కల తప్పిన కార్తీక మాసం..
Srisailam Updates: శ్రీశైలమహాక్షేత్రంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు....
కర్నూలు జిల్లా
- కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ కార్తీకమాసోత్సవాల నిర్వహణ
- కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు
- దర్శనానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి
- టైమ్‌స్లాట్ పద్దతిలో అనగా కేటాయించిన నిర్ణీత సమయాలలో దర్శనాలకు అనుమతి
- భక్తులు మాస్కును ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం తప్పనిసరి
- ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు
- కోవిడ్ నియంత్రణలో భాగంగా స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి
- 10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సుగల వారికి మాత్రమే దర్శనాల అనుమతి
- కార్తీకసోమవారాలు, పౌర్ణమిరోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన మరియు పుష్కరిణి హారతి ఈరోజు పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన
- భక్తులు కార్తికదీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాటు
- తొలి కార్తీక సోమవారం అం కావడం ప్రారంభపు రోజున స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో అర కిలో మీటర్ బారులు తీరిన భక్తులు
- కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తుల దర్శనాలకు ఏర్పాట్లను చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు
Anantapur District Updates: ప్రశాంతి నిలయంలో ముగిసిన అఖండ భజన...
అనంతపురం:
* పుట్టపర్తిలో ని ప్రశాంతి నిలయంలో ముగిసిన అఖండ భజన.
* విశ్వ శాంతిని కాంక్షిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తుల అఖండ భజన
Anantapur District Updates: ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొనసాగుతున్న అభిషేకాలు, పూజలు...
అనంతపురం:
- ప్రముఖ శైవ క్షేత్రాలు బుగ్గ రామలింగేశ్వర స్వామి, హైమావతి, లేపాక్షి పాప వినాశేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు.
- జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొనసాగుతున్న అభిషేకాలు, పూజలు
Annavaram Updates: సత్యదేవుని సన్నిధిలో ప్రారంభమైన కార్తీక సందడి...
తూర్పుగోదావరి... అన్నవరం
- తెల్లవారుజామునుండి ప్రారంభమైన వ్రతాలు....
- దర్శనాలు..
Kurnool District Updates: శైవ క్షేత్రాలకు నెలవైన కర్నూలు జిల్లాలో కార్తీకమాస శోభ...
కర్నూలు జిల్లా...
* కార్తీక మాసం తొలి రోజు మొదటి సోమవారం ఒకటే రోజు రావడంతో ఆలయాలకు వేకువజాము నుండే చేరుకుంటున్న భక్తులు
* కరోనా నేపథ్యంలో కోనేటి స్నానాలను రద్దు చేయడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న భక్తులు
* శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ ,రుద్రకోడూరు, నవనందుల కు పెరుగుతున్న భక్తుల తాకిడి
* ముందస్తుగానే భక్తుల తాకిడిని ఊహించిన అధికారులు ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేశారు
* కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులు స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవాలని... దేవస్థానం వారికి సహకరించాలని బోర్డులు సైతం ఏర్పాటు
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!
తిరుమల సమాచారం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 28,780 మంది భక్తులు.
- తలనీలాలు సమర్పించిన 8,304 భక్తులు.
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.61 కోట్లు.
Rajahmundry Updates: గోదావరి పుణ్యస్నాణాలకు పోటెత్తిన భక్తులు...
తూర్పుగోదావరి - రాజమండ్రి
- పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం, తొలి సోమవారం కావడంతో గోదావరి పుణ్యస్నాణాలకు పోటెత్తిన భక్తులు
- శివనామస్మరణతో మారుమ్రూగిన గోదావరి తీరంలోని శైవక్షేత్రాలు
- కోవిడ్ నిబంధనలతో గోదావరి రేవులలో స్నానాలు చేయరాదని నిషేధాజ్ఞలు విధించిన అధికారులు
- అయినా భక్తులు తరలివచ్చి రాజమండ్రి- పుష్కరఘాట్ , కోటిలింగాల ఘాట్లలో పుణ్యస్నాణాలు
- గోదావరిలో కార్తీకదీపాలు వదిలి ప్రత్యేక పూఝలు చేస్తున్న భక్తులు
- రాజమండ్రి- శ్రీ ఉమామార్కేండేయ స్వామి , కోటిలింగేశ్వరస్వామి ఆలయాలలో స్వామివారి దర్శనానికి బారులుతీరిన భక్తులు
- పంచారామక్షేత్రమైన సామర్లకోటలో కుమార రామ భీమేశ్వరస్వామి ఆలయయంలో, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే దర్శనాలకు భక్తులు బారులు
-కోవిడ్ తో గోదావరి స్నానాలకు తక్కువగానే వచ్చిన భక్తులు..