Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-16 01:47 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 16 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | పాడ్యమి ఉ. 9-07 తదుపరి విదియ | అనూరాధ నక్షత్రం సా. 5-41 తదుపరి జ్యేష్ఠ | వర్జ్యం రా.10-59 నుంచి 12-29 వరకు | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం మ.12-07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-09 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు








Live Updates
2020-11-17 13:11 GMT

కృష్ణాజిల్లా..

-నాగులచవితి ఉత్సవాలకు ముస్తాబైన మోపిదేవిలో శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం

-రేపు అంగరంగ వైభవంగా జరుగనున్న స్వామివారి నాగుల చవితి ఉత్సవాలు

-స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

-నాగుల చవితి సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం

-రేపు ఉదయం 2 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు

-అనంతరం స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకోనున్న స్థానిక ఎంఎల్ఏ సింహాద్రి రమేష్

-నాగుల చవితి సందర్భంగా రేపు ఆలయంలో నిర్వహించే ప్రత్యేక దర్శనాలు రద్దు

-రేపు స్వామివారిని దర్శించేందుకు సుమారు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు వరకు రావచ్చని అంచనా

-దర్శనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు

-ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు

-దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం డిపోల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

2020-11-17 13:03 GMT

అమరావతి...

-స్థానిక ఎన్నికల అంశంపై HMtv తో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని...

-గతంలో కేసులు లేనప్పుడు ఎందుకు వాయిదా వేశారు సమాధానం చెప్పాలి..

-చంద్రబాబు చెప్తే అపారా.. సుజనా చౌదరి చెప్తే అపారా చెప్పాలి..

-రెండు మూడు కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు ఏ రాష్ట్రంలోనూ ఆపలేదు..

-మార్చిలో పదవి కాలం అయిపోతుందని నిమ్మగడ్డ కంగారు పడుతున్నాడు..

-నిమ్మగడ్డకి అంత ఆత్రం ఎందుకు.. ?

-ఏకగ్రీవాలు జరుగుతుంటే ఉంటాయి.. టీడీపీ కి బలం లేదు కనుక చేతులెత్తేశారు..

-చంద్రబాబు హయాంలో ఏకగ్రీవాలు జరగలేదా..?

-చంద్రబాబు నిమ్మగడ్డ ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కార్యక్రమాలు ఆపాలని చూస్తున్నారు..

-జిల్లాల విభజన అనేది ఎన్నికల ముందు మా హామీ.. పక్రియ జరుగుతుంది..

-చంద్రబాబు మైండ్ పోయింది.. ఎర్రగడ్డలో చేర్చాలి.

2020-11-17 13:00 GMT

కృష్ణాజిల్లా..

-ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి

-ఒకే కుటుంబానికిచెందిన భానావతు శ్రీనివాసు(5), భానావతు యమునా(4)

-ఇద్దరు పిల్లలూ కారులో ఆడుతుండగా కారు డోర్స్ పడటంతో ఊపిరి ఆడక కారులోనే మృతి

-గ్రామంలో విషాద ఛాయలు

2020-11-17 12:58 GMT

విశాఖ..

-డీసీపీ ఐశ్వర్య రస్తోగి కామెంట్స్

-ఇటీవల జరిగిన సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కానిస్టేబుల్స్

-ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన ముగ్గురు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ల అరెస్ట్

-కానిస్టేబుళ్ళుగా పనిచేస్తున్న బి. మనోజ్ కుమార్,ఏ రమణ, బి.హరికృష్ణ

-తిరుపతి నాయక్ అనే వ్యక్తి దగ్గర నుండి 8 లక్షల 90 వేల రూపాయలు వసూలు

-ఇప్పటి వరకు 28 మందిని మోసగించినట్లు గుర్తించాం

-2019 జులై నుండి సస్పెన్షన్ లో ఉన్నారు.

2020-11-17 12:55 GMT

నెల్లూరు:

-యువకులపై విచక్షణా రహితంగా దాడి చేసిన రౌడీ మూకలు

-కిశోర్ అనే వ్యక్తి కారు ను తీసీకెళ్లిన యుగంధర్ అనే వ్యక్తి

-కార్ డేమెజ్ కావడంతో యుగంధర్ ను డబ్బులు చెల్లించమన్న కిశోర్

-డబ్బులు చెల్లించకపోవడంతో యుగంధర్ పై విచక్షణారహితంగా దాడి

-మూడు నెలల క్రితం జరిగిన ఘటన ...ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్

-రెండు వేరు వేరు ఘటనలపై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు.

2020-11-17 12:53 GMT

అనంతపురం:

- కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో నీ మరెమ్మపల్లి వీధి లో చిరుత సంచారం.భయాందోళన లో కాలని వాసులు.

2020-11-17 12:52 GMT

అమరావతి..

-రాష్ట్రంలో నలుగురు ఇంటిలిజెన్స్ డీఎస్పీలను పోలీసు హెడ్ క్వార్టర్స్ కు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆర్డర్లు

-ఐదుగురు డీఎస్పీ స్ధాయి అధికారులకు ఇంటిజెన్స్ డీఎస్పీలుగా బదిలీ

2020-11-17 12:50 GMT

అమరావతి..

-గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ఇచ్చిన భూములకు సరైన నష్టపరిహారం ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన అశ్వనీదత్

-ఈ నెల 26కి వాయిదా వేసిన హైకోర్టు

2020-11-17 12:43 GMT

విజయవాడ..

-ఎమ్మెల్యే-బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్- మల్లాది విష్ణు:

-సింగ్ నగర్ 58,59 డివిజన్లలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో, ప్రజలలో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమం.

-డివిజన్ లో గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

-మా ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాల వ్యవధిలో విజయవాడ నగర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.

-నగరంలో నూతనంగా ఫ్లైఓవర్లు, పోలీస్ స్టేషన్లు, సిసి రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం.

-సంక్షేమ,అభివృద్ధి పై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

-స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.

-టిడిపి నేత చంద్రబాబు నాయుడు ఏజెంటుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రవర్తిస్తున్నారు.

-చంద్రబాబు చేస్తున్న దగా,కుట్ర, నీచ రాజకీయాలు

-ప్రజలు గమనిస్తున్నారు.

-రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుని తిరస్కరించిన బుద్ధి రాలేదు.

-పత్రికలు అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేస్తున్న డ్రామాలు ప్రజలు చూస్తున్నారు.

-సీఎం జగన్ పేదలు ప్రజలకు ఉచితంగా ఇల్లు కేటాయించే విషయంలో చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడు

2020-11-17 12:36 GMT

అమరావతి..

పవన్ కళ్యాణ్..

-కార్యకర్తలు, యువ జనసైనికులు నుంచి పోటీ చేయాలని పలు విజ్ఞప్తులు వచ్చాయి.

-వారి వినతి మేరకు జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికల్లో పోటీ కి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను.

-నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారు.

-జి.హెచ్.ఎమ్.సి.లోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ...ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి.

-తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి.

-ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకొంటున్నారు.

-వారి అభిష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది

Tags:    

Similar News