Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-16 01:47 GMT
Live Updates - Page 2
2020-11-17 12:31 GMT

Chittoor District Updates: బంగారుపాళ్యం మండల కేంద్రంలోని మేదర వీధి లో దారుణం..

చిత్తూరు..

-బంగారుపాళ్యం మండల కేంద్రంలోని మేదర వీధి లో వృద్ధ దంపతులు ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య

-ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు బయట ప్రాంతం నుండి జీవనం కోసం బంగారు పాళ్యం లో నివాసం ఉన్నట్లు సమాచారం

-భర్త కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది

-వృద్ధురాలు ఓ ఫ్యాన్సీ షాప్ నందు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు

2020-11-17 12:26 GMT

Krishna District Updates: లక్ష్మీ నరసింహన్ పోలీసులపై చేసిన ఆరోపణలు నిరాధారం...

 కృష్ణాజిల్లా...

- దళిత పారిశ్రామిక వేత్త లక్ష్మీ నరసింహన్ అంశంపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ సత్యానందం, మహిళా పోలీస్ DSP షేక్ అబ్దుల్ అజీజ్    మీడియా బ్రీఫింగ్

- డిఎస్పీ సత్యానందం

- నందివాడ మండలం తమిరిస గ్రామంలో లక్ష్మీ నరసింహన్ 147 ఎకరాల రొయ్యల చెరువు సబ్ లీజుకు తీసుకొని సాగు చేస్తోంది

- మచిలీపట్నం, గుడివాడ లలో లక్ష్మీ నరసింహన్ పై అనేక ఆర్థిక లావాదేవీల అవకతవకలపై ఫిర్యాదులు విచారణ దశలో ఉన్నాయి

- 2018 లో మచిలీపట్నం పరిధిలో, పలువురిపై కేసు పెట్టిన సందర్భాల్లో తాను ముదలియార్ కులానికి చెందినట్లుగా లక్ష్మీ నరసింహన్ ఫిర్యాదు చేసింది

- గత అక్టోబర్ లో నూకల రామకృష్ణ, అతని కుమారుడు బాలాజీ తనను కులం పేరుతో దూషించారని ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు     చేశాం 

- లక్ష్మీ నరసింహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మహిళ పోలీస్ డిఎస్పి ఆధ్వర్యంలో చట్ట ప్రకారం దర్యాప్తు చేస్తున్నాం

- నూకల రామకృష్ణ, అతని కుమారుడు పై కేసు విచారణ జరుగుతుండగానే తాను సాగు చేస్తున్న చెరువులో 150 టన్నుల రొయ్యలను దొంగిలించినట్లు         నరసింహన్ మరో ఫిర్యాదు చేసింది

- లక్ష్మీ నరసింహన్ ఇచ్చిన రెండో ఫిర్యాదు పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం

- ఆధారాలు లేకపోవడంతో ఎవరినీ అరెస్టు లు చేయలేదు

- చట్ట ప్రకారం విచారణ జరుగుతుంది

- మహిళా పోలీస్ స్టేషన్, DSP షేక్ అబ్దుల్ అజీజ్

- లక్ష్మీ నరసింహన్ ఇచ్చిన రెండు ఫిర్యాదులపై కేసు నమోదు చేసి చట్టప్రకారం విచారణ చేస్తున్నాం

- లక్ష్మీ నరసింహన్, నూకల రామకృష్ణ కు చెరువు సబ్ లీజు సొమ్ము తో పాటుగా ఆరు లక్షల కరెంట్ బిల్లులు బకాయి

- బకాయి సొమ్ము ఇవ్వని నేపథ్యంలో 20 టన్నుల రొయ్యలను, తమ బకాయి గా జమ చేసుకొని రామకృష్ణ తీసుకెళ్లినట్లు గా గుర్తింపు

- సంబంధం లేని ఇతర ఆర్థిక లావాదేవీల కేసులను నూకల రామకృష్ణ కేసుతో ముడి పెట్టడం వల్ల, విచారణ ఆలస్యమవుతోంది

- పోలీసులపై లక్ష్మీనరసింహన్ చేసిన వాక్యాలు పూర్తి నిరాధారం

- ఆమెపై పలువురు చేసిన ఫిర్యాదులపై కూడా విచారణ జరుగుతుంది

2020-11-17 12:14 GMT

Visakha weather Updates: ఈశాన్య, తూర్పు దిశల నుండి వీస్తున్న గాలులు...

  విశాఖ...

- ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య, తూర్పు దిశల నుండి వీస్తున్న గాలులు...

- కొమరిన్ ప్రాంతము నుండి ఉత్తర తమిళనాడు తీరం వరకు 1.5 km ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి....

- పశ్చిమ దిశ వైపు ప్రయాణించి, మాల్దీవుల నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు కొనసాగుతున్న ద్రోణి..

- ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో అక్కడ అక్కడ వర్షాలు

2020-11-17 12:12 GMT

Amaravati Updates: ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌..

 అమరావతి

- ‘వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం’ తో పాటు, ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి అక్టోబరు నెలలో సంభవించిన పంటల నష్టంపై పెట్టుబడి     సహాయం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) చెల్లింపు.

- క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌

- సీఎం జగన్ కామెంట్స్:

- ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం

- సీఎం స్ధానంలో మీ బిడ్డ కూర్చున్నాడు

- దేశంలో ఎవరూ చేయని విధంగా వారికి అండగా నిలబడుతున్నాం

- ఏ సమస్య వచ్చినా మీ బిడ్డగా తోడుగా ఉంటాను

- రైతులకు ఎంత చేసినా తక్కువే

- సకాలంలో రుణాలు చెలిస్తే ప్రభుత్వం వడ్డీ కడుతుంది

- ఆ నమ్మకాన్ని రైతుల్లో కల్పించాం, గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి భరోసా ఇవ్వలేదు.

- రైతులు, అక్కచెల్లమ్మలకు మరింత ఆదాయం వచ్చేలా అమూల్ ద్వారా పాలసేకరణ

- 3 జిల్లాల్లో ఈ నెల 26 నుంచి తొలిదశ పాలసేకరణ.

- రాష్ట్ర వ్యాప్తంగా 9800 బీఎంసీయూలు.‌

- ఆర్బీకేల పక్కనే బీఎంసీయూల నిర్మాణం 

2020-11-17 12:08 GMT

West Godavari Updates: అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు...

పశ్చిమ గోదావరి జిల్లా..

తాడేపల్లిగూడెం...

- అనేక కేసుల లో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 18.30 కాసుల బంగారం,

- 5లక్షల నగదు, 2బైక్ లు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు...

2020-11-17 12:03 GMT

Amaravati Updates: ఏపీలో కరోనా అదుపులోకి వస్తోంది..

   అమరావతి

* నిమ్మగడ్డ రమేష్ ,ఎన్నికల కమీషనర్

* గతంలో పదివేలు కేసులు ఉంటే..ఇపుడు 753 కి తగ్గాయి

* రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు వలన ఇది సాధ్యపడింది

* డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది నిస్వార్థంగా పని చేయడంతో ఇది సాధ్యం అయ్యింది

* తెలంగాణ..జీహెచ్ఎంసీ ఎన్నికలను పూర్తి భద్రతా చర్యలతో నిర్వహిస్తోంది

* ఎన్నికల నిర్వహణ.. రాజ్యాంగ బద్ధ, న్యాయబద్ద మైన బాధ్యత

* రాజస్థాన్ లో కూడా ఈ బాధ్యత ను సమర్థవంతంగా నిర్వహించారు

* ప్రభుత్వం తో సంప్రదించిన తరువాత ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయబడుతుంది

* షెడ్యూల్ ఇచ్చిన తర్వాత నాలుగు వారాల ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది

* భవిష్యత్ లో ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ తప్పనిసరి

* ఏపీ ప్రభుత్వం,ఆరోగ్య శాఖ తెలిపిన అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుంది

* స్వేచ్చాయిత ,పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి బాద్యుల అందరి సహకారం కోరుతున్నాము

2020-11-17 11:51 GMT

Nellore District Updates: ఉద్యోగ భద్రత కావాలంటూ నిరసన దీక్ష చేపట్టిన కార్మికులు...

   నెల్లూరు: 

-- సీఐటీయూ కార్యదర్శి నరసింహారావు..

-- జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న కృష్ణపట్నం పోర్టు కార్మికుల ఆందోళన.

-- పోర్టు కార్మికులకు సంఘీభావం తెలిపిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నర్సింగ్ రావు.

-- కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోంది.

-- అన్యాయంగా కార్మికుల పొట్ట కొడుతోంది.

2020-11-17 11:47 GMT

Anantapur Updates: సోము వీర్రాజు పై అనంతపురం టు టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు..

  అనంతపురం:

* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పై అనంతపురం టు టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు.

* సలీం కుటుంభం ఆత్మహత్య ఘటన పై విద్వేషాలు రెచ్చగొడుతూ మాట్లాడారని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు.

2020-11-17 11:38 GMT

Vijayawada Updates: పోలీసు కష్టడీకి దివ్యతేజస్విని కేసు నిందితుడు..

  విజయవాడ...

- మూడు రోజులపాటు కష్టడీకి అనుమతించిన న్యాయస్ధానం

- రేపటి నుంచీ ఈనెల 20 వరకూ కష్టడీకి అనుమతించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు

- రేపు కష్టడీకి తీసుకుని విచారించనున్న పోలీసులు

2020-11-16 14:42 GMT

Vijayawada Updates: శివాలయంలో విరిగిపడ్డ ధ్వజస్తంభం....

 విజయవాడ

* సత్యనారాయణ పురం శివాజీ కేఫ్ సెంటర్ లోని శివాలయంలో విరిగిపడ్డ ధ్వజస్తంభం....

* కార్తీక సోమవారం కావడంతో శివాలయానికి పోటెత్తిన భక్తులు

* ఒక్కసారిగా కూలిన ధ్వజస్తంభం

* మణిక్యంభా అనే భక్తురాలుకు తీవ్ర గాయాలు

* హాస్పిటల్ కు తరలించిన స్థానికులు

* శివాలయం మూసివేసిన కమిటీ సభ్యులు

* తృటిలో తప్పిన పెను ప్రమాదం

Tags:    

Similar News