East Godavari Updates: ఆత్రేయపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..
తూర్పుగోదావరి :
కొత్తపేట..
- ఆత్రేయపురం మం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..
- శనివారం కావడంతో ఏడు వారాల నోములు తీర్చుకునేందుకు కరోనా సమయంలోనూ ఆలయానికి విచ్చేస్తున్న భక్తులు..
Kadapa Updates: గాలివీడు వెలిగల్లు జలాశయం వద్ద నేడు ఎత్తిపోతల పథకం భూమి పూజ..
కడప:
-గాలివీడు మండల పరిధిలోని వైఎస్సాఆర్ వెలిగల్లు జలాశయం వద్ద నేడు ఎత్తిపోతల పథకం భూమి పూజ
-శిలాఫలకం శంకుస్థాపన, పనులు భూమి పూజతో పాటు జలాశయం నీటికి జలహారతి ఇవ్వనున్న డిప్యూటి సిఎం అంజాద్‌బాషా, ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
-అనంతరం వెలిగల్లు జలాశయం ప్రధాన గేట్లను ఎత్తి ట్రయిల్‌రన్ నీటిని దిగువకు విడుదల చేస్తాయనున్న డిప్యూటి సిఎం, ఎంపి, ఛీఫ్ విప్
Guntur Updates: అడవితక్కెలపాడులోని టిడ్కో ఇళ్ల వద్ద టిడిపి ఆందోళన...
గుంటూరు....
-అడవితక్కెలపాడులోని టిడ్కో ఇళ్ల వద్ద టిడిపి నేడు ఆందోళన...
-నాఇల్లు నాసొంతం అనే పేరుతో భాధితులతో టిడిపి ధర్నా....
Guntur Updates: సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉండవల్లి శ్రీదేవి..
గుంటూరు....
-సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఇద్దరు కార్యకర్తలపై నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.
-ఎమ్మెల్యేకు ఇద్దరూ కార్యకర్తలకు మధ్య పేకాట వివాదం.
-పేకాట క్లబ్ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కిన కార్యకర్త...
-ఎమ్మెల్యే అనుచరులమంటూ ప్రచారం చేసుకున్న కార్యకర్తలు....
-ఖండించిన ఎమ్మెల్యే.
-దీంతో తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు.....
Tirumala-Tirupati Updates: రేపు డయల్ యువర్ ఈవో కార్యక్రమం..
తిరుమల..
-టీటీడీ పరిపాలన భవనంలో సమావేశ మందిరంలో జరుగనుంది.
-భక్తులు తమ సందేహాలను, సూచనలను ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ఫోన్ ద్వారా నేరుగా ఈవోకి తెలుపవచ్చు
Somasila Project Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం..
నెల్లూరు:
-- ఇన్ ఫ్లో 8724 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో 9298 క్యూసెక్కులు.
-- ప్రస్తుత నీటి మట్టం 75.026 టీఎంసీ లు .పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు
Vijayawada Updates: దివ్య కేసులో ఇరవై రోజుల తర్వాత పోలీసుల అదుపులో నిందితుడు నాగేంద్ర..
విజయవాడ..
-బీటెక్ విద్యార్థిని దివ్య హత్య కేసులో ఇరవై రోజుల తర్వాత పోలీసుల అదుపులో నిందితుడు నాగేంద్ర
-వైద్యపర చిక్కులతో ఆలస్యమైన అరెస్ట్
-నిందితుడు నాగేంద్రను విచారిస్తున్న పోలీసులు
-హత్యకు గల అసలు కారణాలు రాబడుతున్న దిశా టీం
-నాగేంద్ర వెల్లడించిన ఆరుమంది స్నేహితులను కూడా ఇంటరాగేట్ చేయనున్న ప్రత్యేక బృందం
-హత్య కేసులో ఇప్పటికే 45 మంది సాక్షులనుంచి వివరాలు సేకరణ
-చార్జిషీట్ ,రిమాండ్ రిపోర్ట్ సిద్ధం
-ఈరోజు మూడో మెట్రోపాలిటిన్ కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు
-సమగ్ర విచారణ కోసం వారం రోజుల కస్టడీకి కోరే అవకాశం
Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
తిరుమల సమాచారం..
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 23,515 మంది భక్తులు
-తలనీలాలు సమర్పించిన 8,427 మంది భక్తులు
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు
Kurnool Updates: నంద్యాల లో వెలుగులో కి వచ్చిన సంచలన విషయాలు..
కర్నూలు జిల్లా..
-నంద్యాల లో రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య కేసు..లో వెలుగులో కి వచ్చిన సంచలన విషయాలు..
-పోలీసుల వేధింపులే తమ ఆత్మహత్య కారణం..సెల్ఫీ వీడియో లో తేల్చి చెప్పిన మృతుడు అబ్దుల్ సలాం..
-మృతుల కుటుంబాలను పరామర్శించి..కంట తడి పెట్టిన నంద్యాల ఎం ఎల్ ఏ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి..
-సంఘటనకు కారణమైన వారిని వదిలి పెట్టెబోమని తెలిపిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి...