Live Updates: ఈరోజు (07 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 07 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 07 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి రా. 2-11 తదుపరి అష్టమి | పుష్యమి నక్షత్రం తె. 4-43 తదుపరి ఆశ్లేష | వర్జ్యం మ. 12-35 నుంచి 2-11 వరకు | అమృత ఘడియలు రా.10-16 నుంచి 11-52వరకు | దుర్ముహూర్తం ఉ. 6-04 నుంచి 7-34 వరకు | రాహుకాలం ఉ.9-00 నుంచి 10.30 వరకు | సూర్యోదయం: ఉ.06-04 | సూర్యాస్తమయం: సా.05-24
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 7 Nov 2020 9:31 AM GMT
Nellore District Updates: ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదుట కరోనా సమయాన పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన...
నెల్లూరు :
-- ఒక్కసారిగా వందలాది మంది ఉద్యోగులను తొలగించాలంటూ రోడ్డెక్కిన తాత్కాలిక ఉద్యోగులు.
-- జిజిహెచ్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.
-- ప్రభుత్వ ప్రధాన వైద్యశాల పర్యవేక్షకుల పై ఆగ్రహం.
-- జిజీ హెచ్ కి వచ్చిన రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డినీ అడ్డుకున్న తాత్కాలిక ఉద్యోగులు.
-- జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని గిరిధర్ రెడ్డి హామీ.
-- జిల్లా అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని తాత్కాలిక ఉద్యోగుల బైఠాయింపు.
-- పోలీసుల రంగప్రవేశం. తాత్కాలిక ఉద్యోగులకు మధ్య వాగ్వాదం తోపులాట
-- భారీ ఎత్తున రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు దళాలు.
-- తొలగించిన తాత్కాలిక ఉద్యోగులకు మద్దతు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు.
-- కరోనా సమయంలో విధులు నిర్వహించిన వారిని తొలగించడం అన్యాయం- మధు
-- కరోనా సమయంలో పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం అన్యాయం.
-- సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా-- మధు
-- జి జీ హెచ్ తాత్కాలిక ఉద్యోగుల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా నిలుస్తాం-- మధు.
- 7 Nov 2020 9:28 AM GMT
Tirumala-Tirupati Updates: విజిలెన్స్ అదికారుల సోదాలు!
తిరుపతి
- రామానుజ సర్కిల్ వద్ద సదరన్ స్పైస్ హోటల్ లో విజిలెన్స్ అదికారుల సోదాలు
- కుళ్లిన మాంసం,ఇతర ఆహార పదార్ధాల గుర్తించిన అధికారులు
- 7 Nov 2020 9:27 AM GMT
Vijayawada Updates: దివ్య తేజస్విని కేసు సమాచారం..
విజయవాడ
-మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలులో కోవిడ్ టెస్టులు
-అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు నిందితుడు నాగేంద్ర
- 7 Nov 2020 9:23 AM GMT
Amaravati Updates: ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు..
అమరావతి
- మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం
- మఠాధిపతి సుభుదెంద్రతీర్థ స్వామీజీ, ఫోన్ చేసి విచ్చేయ వలసిందిగా విజ్ఞప్తి
- మఠాధిపతి తరఫున పవన్ కల్యాణ్ కు ఆహ్వాన పత్రిక, రాఘవేంద్ర స్వామి తీర్థ ప్రసాదాలు అందచేత
- 7 Nov 2020 7:57 AM GMT
Tirumala-Tirupati Updates: టిటిడి ఎస్వీబిసి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ విబి సాయిక్రిష్ణ యాచేంద్ర..
తిరుపతి
** ఎస్వీబిసి ఛైర్మన్ యాచేంద్ర...
** శ్రీవారి ప్రాభవాన్ని దశదిశలా వ్యాపించడం కోసం వ్యవస్థీకృతమైన సంస్థలో శక్తి వంచనలేకుండా పని చేస్తాను
** స్వామివారు కల్పించిన అవకాశం, ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో నాకీ అవకాశం దక్కింది
- 7 Nov 2020 7:38 AM GMT
Vijayawada Durgamma Updates: దుర్గగుడి ఆవరణలో కూలిన గోడ...
విజయవాడ
- భక్తుల రాక లేకపోవడంతో తప్పిన ప్రమాదం.
- గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్న పట్టించుకోని అధికారులు.
- కొండచర్యలు విరిగిపడిన కొద్దీ రోజుల్లోనే మళ్ళీ గోడలు కులడంతో అప్రమత్తమయిన అధికారులు.
- 7 Nov 2020 7:25 AM GMT
Amaravati Updates: జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం దిశగా పోతోంది..
అమరావతి..
బోండా ఉమా మహేశ్వర రావు
(టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్)
- 17నెలల జగన్ పాలన లో రాష్ట్రం తిరోగమనం దిశగా పోతోంది
- జగన్ పాదయాత్ర లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదు. అన్ని వ్యవస్థలు రివర్స్ లో వెళుతున్నాయి
- 17 నెలల్లో అంతులేని అవినీతి ఇసుక మాఫియా, మద్యం మాఫియా..ఇళ్ళ స్థలాల లో వేల కోట్లు అవినీతి జరిగింది
- పోలవరం వైసీపీ అసమర్ధత కారణం గా ఆగిపోయే పరిస్తితికి వచ్చింది
- వైసీపీ పాలనలో సామాన్యుడు బతకలేని పరిస్తితి వచ్చింది
- వైసీపీ నవరత్నాలు పేరుతో నవమోసా లు చేశారు
- 17 నెలల పాలనలో విధ్వంసాలు, కక్ష సాధింపులే మిగిలాయి
- రాష్ట్రానికి పాడి కుండ లాంటి అమరావతిని నాశనం చేశారు
- 7 Nov 2020 7:18 AM GMT
Tirumala Updates: తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త...
తిరుపతి....
- విష్ణు నివాసంలో 24 గంటలూ సర్వదర్శనం టోకెన్లు జారీ
- భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి
- రైల్వే స్టేషన్, ఆర్టీసీబస్టాండ్ కు వచ్చే యాత్రీకులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి
- టోకెన్ల కోసం వచ్చే భక్తులు మాస్క్ ధరించి, చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచన
- సర్దర్శన టోకెన్ ద్వారా దర్శనానికి ఒకటి లేదా రెండు రోజులు పట్టే అవకాశం
- అందుకు తగ్గట్టు భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచన
- 7 Nov 2020 7:16 AM GMT
Vijayawada Updates: కాపు నేస్తం పథకంలో నిధులు విడుదల చేసిన వేణుగోపాల కృష్ణ....
విజయవాడ..
- కాపు నేస్తం పథకంలో అర్హులైన మరి కొంతమంది కి నిధులు విడుదల చేసిన మంత్రి వేణుగోపాల కృష్ణ..
- అర్హత ఉండీ గతంలో లబ్ది పొందని కాపు మహిళలకు నిధులు విడుదల..
- మొత్తం 95 వేల245 మంది లబ్ధిదారులను కొత్తగా గుర్తించిన ప్రభుత్వం..
- 142.87 కోట్ల నిధులను నగదు బదిలీ ద్వారా నేరుగా మహిళల అకౌంట్లకు జమ చేయనున్న ప్రభుత్వం...
- కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా కామెంట్స్
- మనసున్న ముఖ్యమంత్రి అని మరోసారి జగన్ నిరూపించుకున్నారు..
- అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకానికి దూరం కాకూడదని సీఎం చెప్పారు..
- కాపులందరి తరపున సీఎం జగన్ కు ధన్యవాదాలు....
- 7 Nov 2020 7:13 AM GMT
West Godavari Updates: ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాన్ని ప్రారంభించిన చెరుకువాడ శ్రీ రంగనాధరాజు...
పశ్చిమ గోదావరి జిల్లా: ఆచంట..
- పెనుగొండ AMC లో ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధరాజు
- ముఖ్య అతిధిలుగా పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట రమణారెడ్డి ,జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్.రామరాజు
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire