Live Updates: ఈరోజు (07 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-07 01:30 GMT
Live Updates - Page 2
2020-11-07 07:07 GMT

Pragathi Bhavan Updates: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభావన్ లో సమీక్ష...

- మధ్యాహ్నం మూడు గంటలకు కరోన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం

- 2020 - 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష .

- కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ.

- ఈ సమీక్ష కు హాజరుకానున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు.

- సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం.

- సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నిర్మాణం పై సమీక్ష.

- సమావేశానికి హాజరుకానున్న వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో .

- నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.

2020-11-07 07:00 GMT

Prakasam District Updates: బెంగళూరు నుంచి అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో విషాదం...

ప్రకాశం జిల్లా..

- బెంగళూరు నుంచి అద్దంకి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మృతి....

- మృతుడు గుంటూరు జిల్లా చేజర్ల గ్రామానికి చెందిన ఏసుబాబు గా గుర్తించిన అధికారులు.

2020-11-07 06:55 GMT

Visakha Updates: వరలక్ష్మి కేసులో ఇద్దరు యువకులు అరెస్టు...

  విశాఖ

- గాజువాక వరలక్ష్మి హత్య కేసు

- కె.హరిరామకృష్ణరాజు , టి.అప్పన్న అనే ఇద్దరు యువకులు ను అరెస్టు చేసిన గాజువాక పోలీసులు

- రామ్‌ వద్ద అఖిల్‌, వరలక్ష్మి ఆమె కుటుంబం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, అన్ని గొడవలు సెటిల్‌ చేస్తామని చెప్పి రూ.10 వేలు       డిమాండ్‌ చేసిన.హరి అప్పన్న

- రామును బెదిరించి 7వేలు తీసుకున్న ఇద్దరు యువకులు

2020-11-07 06:53 GMT

Srikakulam Updates: బందరువానిపేటలో విపత్తు సన్నాహాలపై మాక్ డ్రిల్..

శ్రీకాకుళం జిల్లా..

- బందరువానిపేటలో విపత్తు సన్నాహాలపై మాక్ డ్రిల్..

-10వ ఎన్.డి.ఆర్.ఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో డ్రిల్ నిర్వహణ..

2020-11-07 06:47 GMT

Visakha Updates: జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి!

  విశాఖ...

- జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పెందుర్తి మండలం పెడగాడి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించిన విశాఖ రురల్ జిల్లా వై.    ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు

 - పాదయాత్ర కు అధికసంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు

2020-11-07 06:39 GMT

Kadapa District Updates: దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ న్యాయవాదుల నిరసన...

   కడప :

-- రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కడప నగరంలోని అంభేద్కర్ సర్కిల్ లో

-- ఎస్సి, ఎస్టీ ,బీసీ మరియు మైనార్టీ న్యాయవాదుల నిరసన...

-- అంభేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన న్యాయవాదులు....

2020-11-07 06:29 GMT

S.Vishnu Vardhan Reddy Comments: ఎస్‌సి, ఎస్‌టిలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది...

ప్రకాశం:

బి.జె.పి. నేత విష్ణువర్ధన్‌రెడ్డి కామెంట్స్‌...

-కోవిడ్‌ నేపధ్యంలో కేంద్రం అందిస్తున్న సాయాన్ని అందిరికీ సమానంగా పంచాల్సింది పోయి మత ప్రాతిపదికన పాస్టర్లకు 5 వేల రూపాయలు కేటాయించడం   ఎస్‌సిలకు అన్యాయం చేయడమే...

-మతం మార్చుకుని పాస్టర్లుగా ఉంటూ ఎస్‌సి, ఎస్‌టి సర్టిఫికెట్లతో లబ్ది

-పొందుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి...

-పాస్టర్లు పొందిన ఎస్‌సి, ఎస్‌టి సర్టిఫికెట్లను రద్దు చేయాలి...

-పేదలకు ఎవరికి సాయం చేసిన అభ్యంతరం లేదు...

-ఈ వ్యవహారంపై కేంద్రం విచారణకు ఆదేశించింది...

-టిటిడి సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది...

-ఇతర మతాలకు చెందిన సొమ్మును ప్రభుత్వం ఇలాగే వినియోగం చేసే దైర్యం ఉందా...

-కేంద్ర ప్రభుత్వ పధకాలను పేరుమార్చి వైయస్‌ఆర్‌, జగనన్న పధకాలుగా ప్రచారం చేసుకుంటోంది...

-రాష్ట్రంలో అభివృద్ది శూన్యం... అధికారులు జగనన్న భజన చేస్తున్నారు...

-దేవాలయాలను వైయస్‌ఆర్‌ పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తున్నారు.

-పోలవరం నిర్మాణం కేంద్రం చూసుకుంటుంది...

-నిధుల విషయంలో టిడిపి, వైసిపి పార్టీలకు ఏం సంబంధం...

-రెండు పార్టీలు పోలవరాన్ని ఏటియంలుగా మార్చేశారు...

-కమీషన్ల కోసం ఇరు పార్టీలు కాంట్రాక్టర్లను మార్చేశారు.

-ప్రాజెక్టు నిర్మాణం బిజెపి ప్రభుత్వం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తుంది...-

2020-11-07 06:16 GMT

Srikakulam Updates: పోలాకి మండలంలో రెండవ రోజు సంఘీభావ యాత్ర..

  శ్రీకాకుళం జిల్లా..

* పోలాకి మండలం పిన్నింటి పేట బెలమర జంక్షన్ నుంచి రెండవ రోజు సంఘీభావ యాత్ర..

* పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్..

* పాదయాత్రలో పాల్గొన్న వైసిపి జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి..

2020-11-07 04:45 GMT

Visakha Updates: నక్కపల్లి పోలీస్టేషన్ లో విషాదం....

  విశాఖ...

- నక్కపల్లి పోలీస్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న లేడి కానిస్టేబుల్ భవాని ఆత్మహత్య.

- పోలీస్టేషన్ ఎదురుగా ఉన్న క్వార్టర్స్ లో తన నివాసంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య.

2020-11-07 04:34 GMT

East Godavari Updates: శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..

తూర్పుగోదావరి :

 కొత్తపేట...

- కొత్తపేట మండలం మందపల్లి శనీశ్వరస్వామి ఆలయానికి విచ్చేసిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్..

- స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజేంద్రప్రసాద్..

Tags:    

Similar News