మీవల్ల కాదంటే.. మాకు అప్పగించండి.. నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ..

KTR Letter to Nirmala Sitharaman: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

Update: 2022-06-19 14:30 GMT

మీవల్ల కాదంటే.. మాకు అప్పగించండి.. నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ..

KTR Letter to Nirmala Sitharaman: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కేంద్రప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల అమ్మకాన్ని లేఖలో తీవ్రంగా ఖండించారు. మొత్తం ఆరు సంస్థల్లోని కేంద్రం వాటాలను ఉపసంహరించుకుంటుందని కేటీఆర్ తెలిపారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్తాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను డిజిన్వెస్ట్ మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ ఆరోపించారు.

అయితే ఈ ఆరు సంస్థల్లో తెలంగాణ రాష్ట్రం కేటాయించిన 7 వేల 2 వందల ఎకరాల భూమి ఉందని వాటి విలువ ప్రభుత్వ ధరల ప్రకారం 5 వేల కోట్లు కాగా బహిరంగ మార్కెట్ లో ఏకంగా 40 వేల కోట్లు అని తెలిపారు. వెంటనే ఆయా భూముల్లో కొత్త పరిశ్రమలు సంస్థలు నెలకొల్పాలని లేకపోతే ఆ భూములను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని లేఖలో కోరారు.

Tags:    

Similar News